దర్శకరత్న బయోపిక్ ని డైరెక్ట్ చేసేది అతనేనా…?

0

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా రచయితగా నటుడిగా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించి టాలీవుడ్ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించారు. దాసరి దగ్గరకు వెళ్లకుండా ఇండస్ట్రీలో ఏ పని జరగదు.. ఏ సమస్యా పరిష్కారమవ్వదు అనే స్థాయికి చేరిపోయారు. సినీ ప్రేక్షకులను దాసరి వదిలి వెళ్లిపోయినా దర్శకరత్నగా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి ఘన ఖ్యాతిని సంపాదించుకుని నేటితరానికి ఆదర్శంగా నిలిచిన లెజెండరీ దాసరి బయోపిక్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి.. దాసరి నారాయణరావు బయోపిక్ ని తెరకెక్కించడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. స్వతహాగా దాసరికి అభిమాని అయిన మారుతి.. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు కనీసం రెండేళ్లు స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలని అనుకున్నాడట. మరి లెజెండరీ డైరెక్టర్ జీవితకథను వెండితెరపై ఆవిష్కరించడానికి మారుతి అనుభవం సరిపోతుందా అని ఫిలిం సర్కిల్స్ లో డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ బయోపిక్ పై మరింత క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘భలే భలే మగాడివోయ్’ ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన మారుతి.. మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ ని క్రియేట్ చేస్తున్నాడని తెలుస్తోంది.