Templates by BIGtheme NET
Home >> Cinema News >> పెళ్లికి రెడీగా ఉన్న మెగాబ్రోస్!

పెళ్లికి రెడీగా ఉన్న మెగాబ్రోస్!


మెగా ఫ్యామిలీలో వ‌రుతేజ్ పెళ్లితో వార‌సులు ముగిసిన‌ట్లే. ఇక‌పై త‌ర్వాత త‌రం మొద‌ల‌వుతుంది. వాళ్ల‌కు పుట్టే పిల్ల‌ల‌తో కొత్త త‌రం పురుడు పోసుకుంటుంది. మ‌రి ఇంకా ఆ ఫ్యామిలీలో పెళ్లికాని ప్ర‌సాద్ లు ఎవ‌రైనా ఉన్నారా? అంటే ప్ర‌ధానంగా ముగ్గురు క‌నిపిస్తున్నారు. వాళ్లే మెగా మేన‌ల్లులు సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్.. అలాగే అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు శిరీష్. ఈ ముగ్గురే ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు.

అల్లు వారి రెండో అబ్బాయి అర్జున్ ఇప్ప‌టికే ఓ ఇంటివాడు అయ్యాడు. స్నేహారెడ్డిని వివాహం చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. అలాగే అల్లుబాబి కూడా సినిమాల్లో యాక్టివ్ అవుతు న్నాడు. ఇప్ప‌డిప్పుడే అత‌ని పేరు బాగా వినిపిస్తుంది. బాబి ఫ్యామిలీ లైఫ్ లో ఎప్పుడో బిజీ అయిపోయారు. ఇక మెగా వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌తో జీవితాన్ని చాలా కాలం క్రితం పంచుకున్నారు.

వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠీ తో కొత్త జీవితం మూడు రోజుల క్రిత‌మే ప్రారంభించాడు. ఈనేప‌థ్యంలో అభిమానుల క‌ళ్ల‌న్ని ఆ ముగ్గురు బ్రోస్ పైనే ఉన్నాయి. ఇప్ప‌టికే 30లు దాటిన న‌టులు శిరీష్..సాయితేజ్… శిరీష్ కిప్పుడు 36 ఏళ్లు కాగా..తేజ్ శిరీష్ క‌న్నా ఏడాది పెద్ద అంటే 37 ఏళ్లు ఇప్పుడు. ఇక వైష్ణ‌వ్ వీళ్లిద్ద‌రికంటే బాగా చిన్నోడు 28 ఏళ్లు. ఈ నేప‌థ్యంలో ముందుగా సాయితేజ్..శిరీష్ ల‌కు పిల్ల‌ను చూడాల్సిన బాధ్య‌త క‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే పెళ్లి గురించి తేజ్ ని మంచి అమ్మాయిని చూసి చేసుకోవాలి అన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రితోనూ ల‌వ్ లో ప‌డిన‌ట్లు కూడా వార్త‌లు రాలేదు. అలాగే శిరీష్ కూడా ప్రేమ‌కి దూరంగా ఉన్నాడు. ఏ భామ‌తోనూ ప్రేమ‌లో ప‌డింది లేదు. ప్రస్తుతం ఇద్ద‌రు కెరీర్ పై దృష్టి పెట్టినా 35 దాట‌డంతో పెళ్లిపై కూడా సీరియ‌స్ గా ఆలోచించాల్సిన స‌మ‌యం ఇది. వైష్ణ‌వ్ కి ఇంకా ఐదారేళ్లు స‌మ‌యం ఉంది. కూల్ గా కెరీర్ లో నిల‌దొక్కుకున్న త‌ర్వాత ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెడ‌తాడు.