Templates by BIGtheme NET
Home >> Cinema News >> కౌంట్ డౌన్ మొదలెట్టి మరీ పార్టీలు ఇస్తున్న మెగా డాటర్

కౌంట్ డౌన్ మొదలెట్టి మరీ పార్టీలు ఇస్తున్న మెగా డాటర్


మెగా వారి ఇంటి పెళ్లి వేడుకకు అంతా సిద్దం అయ్యింది. ఈనెల 9వ తారీకున మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహంను వైభవంగా ఉదయ్ పూర్ కోటలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నుండి ఎక్కువ మంది స్నేహితులు పెళ్లికి వచ్చే అవకాశం లేకపోవడం వల్ల నిహారిక వారికి ఇక్కడే పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉంది. వరుసగా ఆమె బ్యాచిలర్ పార్టీలు ఇస్తూ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పే పనిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబోయే భర్త చైతన్యతో కలిసి నిహారిక పార్టీలకు హాజరు అవుతుంది. వరుసగా నిహారిక ఇస్తున్న పార్టీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక నిహారిక కాబోయే భర్త చైతన్య తన స్నేహితులకు ఇచ్చే పార్టీలకు కూడా ఈమె హాజరు అవుతూ ఉంది. ఇద్దరు కూడా వారి వారి స్నేహితులకు పెళ్లి తేదీ కౌంట్ డౌన్ చేస్తూ మరీ పార్టీలు ఇస్తున్నారు. తాజాగా నిహారిక మరో ఏడు రోజుల్లో అంటూ పార్టీ ఫొటోను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరుసగా పార్టీల్లో పాల్గొంటున్న నిహారిక మరియు చైతన్యలు ఒకటి రెండు రోజుల్లో ఉదయ్ పూర్ విల్లాకు చేరుకోబోతున్నారు. వధు వరులు మరియు కుటుంబ సభ్యులు కనీసం అయిదు రోజుల పాటు క్వారెంటైన్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే హడావుడి పార్టీలు ఇస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లో మెహిందీ.. సంగీత్ వేడుకలతో పెళ్లి తంతు మొదలయ్యే అవకాశం ఉంది.