తెలుగమ్మాయిలకు మెగా ఆఫర్ బావుందే!

0

మెగా హీరోల సినిమాల్లో తెలుగమ్మాయిలకు ఆఫర్ అంటే ఆషామాషీనా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు ట్యాలెంటును ఎంకరేజ్ చేసేందుకు ఆ కాంపౌండ్ ప్రయత్నం ప్రశంసించదగినదే. ఇంతకుముందు దేవరకొండతో బన్ని వాసు- అరవింద్ టాక్సీవాలా నిర్మించి తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ కి అవకాశం ఇచ్చారు. ఆ అమ్మడికి బన్ని సినిమాలోనే ఛాన్స్ అంటూ ప్రచారమైంది. ప్రియాంక ఎస్.ఆర్ కళ్యాణమంటపం అనే చిత్రంలోనూ నటిస్తోంది.

తాజాగా మరో తెలుగమ్మాయికి మెగా కాంపౌండ్ లో ఛాన్స్ దక్కింది. సుప్రీం హీరో సాయి తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసినదే. సోలో బ్రతుకే తర్వాత మూవీ ఇదే. ఇది ప్రస్థానంలా ఎమోషనల్ గా సాగే పొలిటికల్ డ్రామా అని తెలిసింది. షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రతిభావంతులైన యువ తమిళ అందం నివేదా పెథురాజ్ ఈ చిత్రంలో ప్రధాన నాయిక కాగా తెలుగమ్మాయికి ఛాన్స్ దక్కిందన్న ప్రచారం వేడెక్కిస్తోంది.

తెలుగు నటుడు రాజేష్ వారసురాలు ఐశ్వర్య రాజేష్ ఈ మూవీకి సంతకం చేసినట్లు తాజాగా వెల్లడైంది. అయితే ఐశ్వర్యను నివేథ స్థానంలో తీసుకున్నారా? లేక రెండో హీరోయినా? అన్నది తేలాల్సి ఉంది. అలాగే మెగా మూవీలో మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బాకు ఆఫర్ దక్కిందన్న ప్రచారం కూడా వేడెక్కించింది. అయితే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోనూ ఇషా రెబ్బా నటిస్తోంది.