కొత్త కంటెంట్ తో నిండు కుండలా ఆహా

0

ఆహా-తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ గేమ్ ఛేంజర్ కాబోతోందా? అంటే .. నెమ్మదిగా ఛేంజ్ కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆరంభం కాస్త నెమ్మదిగా ఉన్నా కంటెంట్ పుల్ చేసే కొద్దీ సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారన్న సమాచారం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా చిన్న సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆహా టీమ్. ఇటీవల ఆహాలో విడుదలైన చిన్న చిత్రం `కలర్ ఫొటో`. సుహాస్- చాందిని ప్రధాన పాత్రల్లో నటించారు. రివ్యూస్.. డివైడ్ టాక్ వంటివి వినిపించినా ఈ మూవీ బాగానే గెయిన్ చేసింది. ఆహాకు మంచి మైలేజ్ ని తీసుకొచ్చింది. దీంతో ఆహా టీమ్ అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. కొత్త తరహా కంటెంట్ ని ప్రోత్సహించాలని ఒరిజినల్స్ ని రంగంలోకి దింపాలని తన గేమ్ ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది.

`కలర్ ఫొటో` ఊహించని విధంగా విజయవంతం కావడం.. చాలా మంది సెలబ్రిటీలు ఈ మూవీకి స్వచ్ఛందంగా ప్రచారం చేయడంతో `ఆహా`కు మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పటి వరకు కంటెంట్ లేమీతో వున్న ఆహా క్రమ క్రమంగా పాపులర్ ఓటీటీల జాబితాలోకి వెళుతోంది. అందుకు అనుగుణంగా తన గేమ్ ప్లాన్ని మార్చుకుంటోంది. దీనికి బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కారణంగా చెబుతున్నారు.

నవంబర్ లో ప్రాంతీయ వేదికపై ప్రసారం అవుతున్న ఆహా ఒరిజినల్స్ జాబితాని సరికొత్తగా సిద్ధం చేస్తోంది. వీటన్నిటిలో చాలా ఆసక్తికరమైనది సమంతా అక్కినేని .. వెన్నెల కిషోర్ ల ‘సామ్ జామ్’. ఇది వినోదాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను మరింతగా పెంచేలా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. వివా హర్షతో ‘తమాషా విత్ హర్ష’ టాక్-స్కెచ్ కామెడీ షో ని కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

పునర్నవితో చేసిన ‘కమిట్ మెంటల్’ .. పాయల్ రాజ్పుత్… చైతన్య కృష్ణలతో చేసిన ‘అనగనగా ఓ అతిథి’.. సిద్ధూ జొన్నలగడ్డ `మన వింత గాథ వినుమ` ఆహాలో నవంబర్ నెలలో స్ట్రీమింగ్ కానున్నాయి. కొత్తదనంతో కొత్త కంటెంట్ తో ఆహా ఒరిజినల్స్ తో రెడీ గా వుంది. ఇక ఆడియన్స్ దే ఆలస్యం.. కంటిన్యూగా గ్యాప్ లేకుండా ఆస్వాధించేంత కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది మరి.