Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెట్రో కథలు టీజర్ టాక్

మెట్రో కథలు టీజర్ టాక్


మెట్రోల్లో జీవించడం అంటే ఆషామాషీనా? ఓవైపు సంపన్న వర్గాలు.. మరోవైపు బీద బక్క జీవులు.. కూలీలు .. చిరుద్యోగులు.. మధ్యతరగతి బతుకుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నగర జీవనం ఎంత కష్టమో ఇవాళ కరోనా పాఠం కళ్ల ముందే సాక్షాత్కరించింది. బతుకు కోసం ఇక్కడ ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుందని అందరికీ అర్థమైంది. మెట్రో కథలన్నీ ఎంతో హృద్యంగా ఉంటాయి. అందుకే ఈ నేపథ్యాన్ని ఎంచుకుని వెబ్ సిరీస్ లకు రూపకల్పన చేయడం ఆసక్తికరం.

తాజాగా ఆహా-తెలుగులో `మెట్రో కథలు` వెబ్ ఫిలిం ఉత్కంఠ పెంచనుంది. `పలాస` ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన `మెట్రో కథలు` టీజర్ తాజాగా రిలీజైంది. ప్రముఖ జర్నలిస్ట్ మహ్మద్ ఖాదీర్ బాబు రాసిన చిన్న కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ ఆద్యంతం ఎమోషన్ ఆకట్టుకుంటోంది. ప్రతిపాత్రా దేనికదే ప్రత్యేకం. జీవితం అంటే ఎన్నో ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు ప్రతిదీ ఫేస్ చేయాల్సిందే. ఇందులో రాజీవ్ కనకాల సీరియస్ గా కనిపించే పాత్రలోనే నటిస్తున్నాడు. యాంకర్ కం నటి గాయత్రి భార్గవి .. బిగ్ బాస్ ఫేం అలీ రెజా .. కాల్ గర్ల్ పాత్రలో నటించిన తెలుగమ్మాయి నందిని రాయ్ ప్రతి ఒక్కరికీ నటన పరంగా పేరొస్తుందనే అర్థమవుతోంది. ఈ వెబ్ మూవీకి చక్కని సంగీతం కుదిరింది.

ఇటీవల తెలుగు బుల్లితెరపై సీరియళ్ల కథలు కూడా ఇంప్రెస్ చేస్తున్నాయి. అందుకే వెబ్ సిరీస్ కథల్లో సెన్సిబిలిటీస్ పై గ్రిప్ చాలా ఇంపార్టెంట్. టీజర్ లో ఉన్నంత ఇంటెన్సిటీ తెర ఆద్యంతం కనిపిస్తే మెట్రో కథలకు ఆదరణ దక్కే వీలుంటుంది. ఇక వెబ్ సిరీస్ లు వెబ్ సినిమాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎంచుకునేది ఎక్స్ క్లూజివ్ గా ఉండాలి. మెట్రో కథలు తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్టవుతుందో చూడాలి.