నిజమైన ప్రేమ నీతోనే.. నమ్రత ఎమోషన్!

0

సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కానుకగా `సర్కార్ వారి పాట` ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ లుక్ వైరల్ అవుతోంది. నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా పరిశ్రమ ప్రముఖులు సహా శ్రేయోభిలాషుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మహేష్ భార్య నమ్రత ఇంకాస్త అడ్వాన్స్ డ్ గానే తనకు విషెస్ తెలిపారు. నిన్న రాత్రి ఇన్ స్టాగ్రామ్ లో భర్తకు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ నుదిటిపై ముద్దు పెడుతూ ఉన్న అందమైన ఫోటోను నమ్రత పోస్ట్ చేశారు. “నిజమైన ప్రేమను నేను మీతోనే అనుభవించాను.. హ్యాపీ బర్త్ డే MB.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను… ఇప్పుడు అప్పుడు ఎల్లపుడూ..“ అంటూ పోయెటిక్ గానే స్పందించారు నమ్రత.

వంశీ చిత్రీకరణ సమయంలో మహేష్ – నమ్రత జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జర్నీ గురించి తెలిసిందే. ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు. గౌతమ్.. సితార వేగంగానే ఎదిగేస్తున్నారు. గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో బాలనటుడిగా పరిచయం అయ్యాడు. సితార యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి సోషల్ మీడియాల్లోనూ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే.