కుర్రకారు గుండె లయ తప్పే మిల్కీ బ్యూటీ ఫోటో

0

మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. బాహుబలిలో అవంతికగా నటించాక ఈ అమ్మడికి ఊహించని విధంగా టాలీవుడ్ లో బిగ్ గ్యాప్ వచ్చింది. ఆ క్రమంలోనే `ఊపిరి` చిత్రంతో విజయం అందుకున్నా వెంటనే ఆఫర్లు అయితే తన దరి చేరలేదు.

అయితే ఆ సమయంలోనే మిల్కీ బ్యూటీ తెలివైన ఎత్తుగడలతో సస్టెయిన్ అయ్యే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో తనలోని రెబలిజాన్ని బయటకు తీసింది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా ఫోటోషూట్లతో అంతర్జాలాన్ని షేక్ చేయడంలో పెద్ద సక్సెస్ అయ్యింది. సైరా-నరసింహారెడ్డిలో నర్తకిగా తన నటనకు క్రిటిక్స్ సహా ఆడియెన్ ప్రశంసలు దక్కించుకుంది. ఆ క్రమంలోనే మిల్కీ దశ కూడా తిరిగిందనే చెప్పాలి.

తాజాగా మిల్కీ మరోసారి కుర్రకారు గుండె లయ తప్పే ఫోటో ట్రీట్ ని స్టార్ట్ చేసింది. ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన తాజా ఫోటో బోయ్స్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. అసలే మిల్కీ వైట్ అందం.. ఆపై వైట్ టాప్ తో క్రీగంటి చూపుతో గుండె కోసేస్తోందిలా. ఓన్లీ టాప్ తోనే సరిపెట్టుకుని ఇలా కవర్ చేసేస్తోందా … బాటమ్ ఆదమరిచిందా? అంటూ బోయ్స్ కొంటెగా కామెంట్లు రువ్వుతున్నారు. ఏదేమైనా అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో వందకు రెండొందలు శాతం సక్సెసైంది తమ్మూ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.

తమన్నా కెరీర్ సంగతి చూస్తే.. గోపిచంద్ సరసన సీటీమార్ లో నటిస్తోంది. అలాగే `లవ్ మోక్ టైల్` రీమేక్ `గుర్తుందా శీతాకాలం`.. అంధాధున్ తెలుగు రీమేక్ లలో తమన్నా నటిస్తోంది. `ది నవంబర్ స్టోరీ` తమిళ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకొస్తోంది. తన కెరీర్ తొలి డిజిటల్ సిరీస్ డిస్నీ ప్లస్ లో రిలీజ్ కి రెడీ అవుతుంటే తమన్నా తెగ ఎగ్జయిట్ అయిపోతోంది.