ఆలోచింపజేసేలా ‘మిస్ ఇండియా’ లచ్చగుమ్మడి

0

కీర్తి సురేష్ హీరోయిన్ గా జగపతిబాబు.. నదియా.. రాజేంద్ర ప్రసాద్.. నరేష్ కీలక పాత్రలో నటించిన ‘మిస్ ఇండియా’ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న ఈ సినిమా వీడియో సాంగ్ ను విడుదల చేశారు. లచ్చ గుమ్మడి అంటూ సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు మంచి హైప్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగేలా ఈ పాట ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ లిరికల్ వీడియో సాండ్ ఆర్ట్ తో ప్రజెంట్ చేశారు. థమన్ మెలోడియస్ గా ఈ పాటను ట్యూన్ చేశాడు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం ఆలోచింపజేసి విధంగా ఉంది. సినిమా కథను సాహిత్యంలో వివరించే ప్రయత్నం చేయడంతో పాటు సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి పరిచయం కూడా ఉంది. మొత్తానికి ఈ పాట క్లాస్ ఆడియన్స్ పాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పుడు పాట కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మిస్ ఇండియా సినిమా ఒక అమ్మాయి తన కాళ్లపై తాను నిలబడేందుకు చేసే ప్రయత్నంగా చూపించారు.