Templates by BIGtheme NET
Home >> Telugu News >> వడ్డీపై వడ్డీ మాఫీ .. దీనికి అసలు సూత్రధారి ఎవరంటే ?

వడ్డీపై వడ్డీ మాఫీ .. దీనికి అసలు సూత్రధారి ఎవరంటే ?


కరోనా లౌక్ డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్ బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై వీలైనంత త్వరగా వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలని కేంద్రం జారీచేసింది. ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం మార్చి 1 నుండి ఆగస్టు 31 2020 వరకు 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ క్రెడిట్ కార్డు రుణాలు వెహికల్ లోన్స్ ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్లో జమ చేస్తాయి.

దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. దీనివల్ల కేంద్రానికి రూ.6500 కోట్లు అదనపు భారం పడనుంది. మారటోరియం 6 నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ సాధారణవడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయగా తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు దానిని అందిస్తుంది. అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వారికీ రావాల్సిన మొత్తాన్ని వేయాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా 21న కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

అయితే వడ్డీ పై వడ్డీ మాఫీ వెనుక ఉన్నది ఎవరు అంటే .. ఆగ్రాలోని కళ్లద్దాలు షాప్ నిర్వాహకుడు గజేంద్ర శర్మ. సామజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న గజేంద్ర శర్మ లాక్ డౌన్ సమయంలో క్రమంగా ఈఎంఐ కట్టలేకపోయాడు. అదే సమయంలో కేంద్రం మారటోరియం తీసుకొచ్చినా కూడా వడ్డీ పై వడ్డీ వేస్తుందని తెలుసుకొని కోర్టులో ఫీల్ వేశాడు. ఆ తర్వాత కోర్టు దీనిపై స్పందించి కేంద్రం ఆర్బీఐ తో మాట్లాడి .. వడ్డీ పై వడ్డీని కేంద్రమే భరించాలని తీర్పు ఇస్తూ వడ్డీ పై వడ్డీ మాఫీ చేయాలని ఆదేశాలు జారీచేసింది.