‘మిషన్ 2020’ ఫస్ట్ లుక్…!

0

‘సంభవామి యుగే యుగే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన నవీన్ చంద్ర ‘అందాలరాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలు వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడు హీరోగా నటిస్తూనే విలన్ కూడా నటిస్తూ వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ”మిషన్ 2020”. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయబడింది.

”మిషన్ 2020” చిత్రాన్ని హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకటేష్ గౌడ్ మరియు రమేష్ రాజు సంయుక్తంగా నిర్మించారు. బాబ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబ్జీ ఇంతకుముందు ‘మెంటల్ పోలీస్’ ‘ఆపరేషన్ 2019’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. సమకాలీన రాజకీయ నేపథ్యంలో బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి ప్రేరణతో ఈ చిత్రం రూపొందిందని తెలుస్తోంది. ఇప్పటికే కంప్లీట్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన శ్రీకాంత్.. 2020 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి పెద్ద సంక్షోభమని.. ‘మిషన్ 2020’ సినిమా ఆ సంక్షోభాన్ని ఛేదిస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో హీరో నవీన్ చంద్ర తోపాటు నాగబాబు – జయ ప్రకాష్ లు కనిపిస్తున్నారు. ఈ సినిమా బాగా వచ్చిందని.. శ్రీరాపాక తో చేసిన ఐటమ్ సాంగ్ 2020లో సెన్సేషన్ అవుతుందని.. సినిమా మంచి విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.