పీపీఈ కిట్ లో మోహన్ బాబు లుక్…వైరల్

0

కరోనా మహమ్మారి దెబ్బకు విధించిన లాక్ డౌన్ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. షూటింగులు వాయిదా పడడంతో దాదాపు నాలుగు నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటీవల అన్ లాక్ లో భాగంగా నిబంధనలు సడలించడంతో షూటింగులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే కొందరు సెలబ్రిటీలు షూటింగులు వ్యక్తిగత పనుల కోసం ప్రయాణాలు మొదలుబెట్టారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా పీపీఈ కిట్ ధరించి హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఫేస్ మాస్కుతో పాటు గ్లవ్స్ ను ధరించిన భక్తవత్సలనాయుడు విమానాశ్రయంలోకి ఆయన వెళ్తుండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో 560 చిత్రాలలో కథానాయకుడు ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మోహన్ బాబు నిర్మాతగా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆచితూచి విలక్షణ సినిమాల్లో నటిస్తున్న మోహన్ బాబు…ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం తన తదుపరి ప్రాజెక్ట్ అని మోహన్బాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో పోస్ట్ చేసిన మోహన్బాబు లుక్ వైరల్ అయింది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు.