మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ !

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ చెప్పిన విధంగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలు భారీగా పెంచింది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం సరఫరా ఎక్కువగా అవుతుండటంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఐఎంఎఫ్ లిక్కర్ ఫారెన్ లిక్కర్ బీర్ వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ ధరలల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది.

150 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలు తగ్గించారు. కానీ 190 నుంచి 600 రూపాయల వరకు ఉన్న మద్యం ధరలు పెంచారు. అంతే కాక బీర్లు రెడీ టు డ్రింక్ ధరలను కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇక ఇప్పటికే హైకోర్టు మందుబాబులకి శుభవార్త చెప్పింది. పక్క రాష్ట్రాల నుండి మూడు మందు బాటిల్స్ రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిల్స్ తీసుకుని రావొచ్చని చెప్పింది. ఈ జీవోను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్కు సూచించింది. దీంతో లిక్కర్ ప్రియుల ఆనందానికి అవధులు లేవు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే .. మందు బాబులు బోర్డర్ కు వెళ్లి మరీ మందు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. అలా అయితే మందు అంతా పక్క రాష్ట్రాలకి వెళ్లి పోతుంది దానిని దృష్టిలో పెట్టుకుని ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు కొందరు చెప్తున్నారు.