Templates by BIGtheme NET
Home >> Cinema News >> వివాదంకు ‘పెద్దాయన’ ఫుల్ స్టాప్ పెట్టాడా?

వివాదంకు ‘పెద్దాయన’ ఫుల్ స్టాప్ పెట్టాడా?


చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ కథ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇద్దరు రచయితలు కథ నాది అంటే నాది అంటూ మీడియా ముందుకు వచ్చారు. కొరటాల శివ తమ కథను అనుమతి లేకుండా వాడుతున్నాడంటూ రచయితలు ఆరోపించారు. ఈ వివాదంలో ముఖ్యంగా రాజేష్ మండూరి అనే రచయిత సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. కథను నేను మైత్రి మూవీస్ వారికి వినిపించాను. దాన్ని వారు నచ్చినప్పటికి నాతో సినిమా చేసేందుకు వారు ఒప్పుకోలేదు. కథ కావాలని అడిగారు కాని నేను ఇవ్వలేదు అన్నాడు. కొరటాల శివకు ఆ కథను ఇచ్చి ఆచార్యను చేయిస్తున్నట్లుగా విమర్శలు చేశాడు.

కథ విషయంలో కొరటాల శివ స్పందించాడు. తాను రాసుకున్న కథతో ఆచార్య తీస్తున్నాను. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. నాపై అబాండాలు వేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించాడు. అలాగే లీగల్ గా కూడా వెళ్తానంటూ పేర్కొన్నాడు. ఈ వివాదం ఉన్నట్లుండి చల్లారిపోయింది. దాంతో ఈ సినిమా వివాదం దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ఈ వివాదంకు ఫుల్ స్టాప్ పడటం వెనుక చిరంజీవి ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన చొరవ వల్లే కథ వివాదం సర్దుమణిగిందని పేర్కొన్నారు.

చిరంజీవి నేరుగా రచయిత రాజేష్ ను కలవకున్నావివాదానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగాడు అంటున్నారు. కథ విషయంలో ఉన్న అనుమానాలు తీర్చుకోవడం లేదు. కాని దాన్ని వివాదాస్పదం చేయడం వల్ల మరో సినిమా కిల్ అవుతుందనే విషయాన్ని గుర్తించాలి. కథ గురించి రాజేష్ చేస్తున్న ఆరోపణలు మరియు ఇతరత్ర విషయాలు ఏమి ఉన్నా కూడా రాజీకి వచ్చేయాలంటూ చిరంజీవి తరపు వ్యక్తి విజ్ఞప్తి చేశాడట. దాంతో రచయిత రాజేష్ తప్పక రాజీ పడ్డాడని అంటున్నారు.