రవితేజ మీసం తిప్పి మరీ ఛాలెంజ్ చేస్తున్నాడు

0

మాస్ మహారాజా రవితేజ.. గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో ‘బలుపు’ తర్వాత తెరకెక్కిన సినిమా ‘క్రాక్’. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని రెండు మూడు సార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను దర్శకుడు కొట్టి పారేశాడు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేసేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. సినిమా ఖచ్చింగా థియేటర్ లోనే వస్తుంది.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందంటూ దర్శకుడు హామీ ఇస్తున్నాడు.

తాజాగా క్రాక్ నుండి వచ్చిన కొత్త పోస్టర్ సినిమా స్థాయిని పెంచుతోంది. పోలీస్ యూనిఫార్మ్ లో ఉన్న రవితేజ మీసం మెలేస్తు సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. రవితేజ లుక్ మరియు స్టైల్ కు అంతా ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నామని అంటున్నారు. సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మీసం తిప్పి మరీ ఛాలెంజ్ చేస్తున్నట్లుగా పోస్టర్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లు ప్రారంభం అవ్వడమే ఆలస్యం వెంటనే విడుదల చేసేందుకు రెడీగా ఉన్నామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.