అఖిల్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మోనాల్

0

తెలుగు బిగ్ బాస్ మొదటి వారం నుండి అఖిల్ మరియు మోనాల్ ల మద్య కెమిస్ట్రీ రొమాన్స్ కొనసాగుతూ వస్తుంది. ఆ రొమాన్స్ వల్లే మోనాల్ చాలా వీక్స్ గా సేవ్ అవుతూ వస్తుంది. చాలా టాస్క్ ల్లో మరియు ఇతర విషయాల్లో మోనాల్ ను సేవ్ చేస్తూ ఆమెకు కొమ్ము కాస్తూ అఖిల్ వచ్చాడు. మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో మోనాల్ గురంచి అఖిల్ కు ఒక వీడియో చూపించడం వల్లో మరేదో కారణం వల్ల ఒక్కసారిగా అఖిల్ మూడ్ మారిపోయింది. అఖిల్ ఇంతకు ముందులాగా మోనాల్ తో ఉండటం లేదు. అఖిల్ విషయంలో మోనాల్ ఎంత క్లోజ్ అవ్వాలని చూసినా కాలేదు.

అఖిల్ ఏకంగా మోనాల్ ను ఎలిమినేషన్ నామినేషన్ లోకి నెట్టేయడం జరిగింది. మోనాల్ ను అఖిల్ నామినేట్ చేయడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. అఖిల్ ఏ కారణంతో నామినేట్ చేశాడు అనే విషయాన్ని ఆలోచించకుండా వెంటనే వెళ్లి అమ్మ రాజశేఖర్ వద్ద మోనాల్ చేసిన వ్యాఖ్యలు ఆమె తీరును పూర్తిగా బయట పెట్టి ఆమె హౌస్ లో ఉండేందుకు అర్హురాలు కాదు అనిపించుకుంది అంటూ అఖిల్ అభిమానులు అంటున్నారు.

ఫ్రెండ్ అని చూడకుండా ఎలా నామినేట్ చేస్తాడు అంటూ అమ్మ రాజశేఖర్ మోనాల్ తో ప్రశ్నించిన సమయంలో అప్పుడు మోనాల్ మాట్లాడుతూ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్ అంటే కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు ఇంకా మోర్ కావాలి. కాని ఆ మోర్ లేదు కనుక అఖిల్ నన్ను నామినేట్ చేశాడు అంటూ అఖిల్ స్నేహంను మరీ చీప్ గా మోనాల్ కామెంట్ చేసింది. ఈ విషయంలో అఖిల్ అభిమానులు కాని వారు కూడా మోనాల్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వారం మోనాల్ నామినేట్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ ఖాయం అంటున్నారు.