Templates by BIGtheme NET
Home >> Cinema News >> మళ్లీ ‘ప్రేమదేశం’ మొదలు పెట్టిన మోనాల్

మళ్లీ ‘ప్రేమదేశం’ మొదలు పెట్టిన మోనాల్


బిగ్ బాస్ ఈ సీజన్ ఆరంభంలో మోనాల్ ను ప్రేమ దేశం సినిమాలో టబు అంటూ ట్రోల్ చేశారు. రాత్రి సమయంలో అభిజిత్ తో డే టైంలో అఖిల్ తో ఈమె మాట్లాడటం ను బిగ్ బాస్ లో చూసిన ప్రేక్షకులు ఆమెకు ప్రేమదేశం హీరోయిన్ ట్యాగ్ ఇచ్చారు. మద్యలో మోనాల్ కు అభిజిత్ కు మద్య గ్యాప్ వచ్చింది. అఖిల్ తో చాలా స్ట్రాంగ్ గా వ్యవహారం ముందుకు తీసుకు వెళ్లింది. ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వెళ్లినట్లుగానే అనిపించినా కూడా ఆమద్య కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. హారిక ను కెప్టెన్ గా మోనాల్ చేయడంతో అఖిల్ మరింతగా ఆమెను దూరం పెట్టాడు.

అఖిల్ మరియు మోనాల్ ల మద్య మొన్న సోమవారం ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చర్చ జరిగింది. మోనాల్ నీ కంటే నేను స్ట్రాంగ్ అంటూ అఖిల్ చెప్పడం.. ఆమె హర్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మోనాల్ స్థానంలో అభిజిత్ సేవ్ అవ్వడం ఆమె నామినేట్ అవ్వడం కూడా జరిగింది. దాంతో మోనాల్ పట్ల అభిజిత్ కు కాస్త సాప్ట్ కార్నర్ ఏర్పడింది. ఆ కారణంగానే మోనాల్ తో మళ్లీ నిన్నటి ఎపిసోడ్ లో మాట్లాడటంతో పాటు నువ్వు మా నాన్నకు నచ్చావు అంటే మామూలు విషయం కాదు అంటూ ఆమెకు సోప్ వేసే ప్రయత్నం చేశాడు.

ఇదే సమయంలో అఖిల్ మరియు మోనాల్ల మద్య వ్యవహారం కూడా కుదరడంతో ఇద్దరు మెల్లగా మాటలు కలిశాయి. దానికి తోడు నిన్నటి ఎపిసోడ్లో అఖిల్కు తన అవసరం ఉండటంతో సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అలా మొత్తానికి మోనాల్ మళ్లీ ప్రేమదేశం హీరోయిన్గా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్న మోనాల్ బయటకు వెళ్తుందా లేదంటే అరియాను లేదా అఖిల్ ను పంపనుందా అనేది చూడాలి.