నా మిత్రుడు నేను తాంత్రిక విద్యను ఫాలో అయ్యాం: స్టార్ డైరెక్టర్

0

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కమెడియన్ సునీల్ స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ సినిమా అవకాశాల కోసం భీమవరం నుండి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. పంజాగుట్టలో ఒకే రూమ్ లో సినీప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత త్రివిక్రమ్ రైటర్ గా సునీల్ కమెడియన్ గా అవకాశాలు పొందుతూ ఈ స్థాయికి వచ్చారు. నువ్వేకావాలి చిత్రంతో కమెడియన్గా సునీల్ కెరీర్ టర్న్ తీసుకుంది. ఆ సినిమా సూపర్హిట్ కావడంతో సునీల్ తో పాటు త్రివిక్రమ్ కి కూడా మంచిపేరు వచ్చింది. ఆ ఇద్దరికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరుసగా సునీల్ చేసిన సినిమాలన్నీ సూపర్హిట్ కావడమే కాకుండా కమెడియన్గా ఫుల్ క్రేజ్ తెచ్చాయి. ప్రస్తుత టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సునీల్ మంచి స్నేహితులు.

సునీల్కి కమెడియన్గా మంచి పేరు తెచ్చిన ‘నువ్వే కావాలి’ నుంచి ‘చిరునవ్వుతో’ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలకు త్రివిక్రమ్ రైటర్గా వర్క్ చేశాడు. త్రివిక్రమ్ పనిచేసిన సినిమాలలో స్నేహితుడు సునీల్ కి మంచి డైలాగులు క్యారెక్టర్లు రాసి అతని ఎదుగుదలకు కారణమయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘నువ్వే నువ్వే’ ‘అతడు’ చిత్రాల్లో కూడా సునీల్కి మంచి క్యారెక్టర్లు ఇచ్చాడు. సునీల్ హీరోగా మారాక త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో సునీల్ కనిపించలేదు. అయితే ఈ మధ్య మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నాక.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అరవిందసమేత’ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలలో సునీల్కి క్యారెక్టర్లు ఇచ్చాడు. అయితే క్యారెక్టర్స్ పెద్దగా పేలలేదు. కానీ సినిమాలు రెండు పెద్ద హిట్స్.

అయితే తాజాగా అల వైకుంఠపురంలో విడుదలైన ఏడాదికి రీయూనియన్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్బంగా త్రివిక్రమ్ మిత్రుడు సునీల్ గురించి మాట్లాడుతూ.. ‘సునీల్ కి నాకు రూమ్ లో ఉండేటప్పుడు తాంత్రిక విద్య బాగా తెలుసు. ఆ విద్యను ఎవరిమీద కాదు మా మీద మేమే ప్రయోగించేవాళ్ళం అంటూ షాకిచ్చాడు. అంతలోనే నాకు చలేస్తే సునీల్ ఫ్యాన్ ఆపేవాడు అలాగే సునీల్ కి దాహం వేస్తే నేను వాటర్ ఇచ్చేవాడిని. అలా మా ఇద్దరి గురించి ఒకరికి ఒకరం బాగా తాంత్రిక విద్యను వాడేవాళ్ళం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సునీల్ కోసమే అల వైకుంఠపురంలో మూవీలో క్యారెక్టర్ రాసానని చెప్పాడు త్రివిక్రమ్. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ తో తీయబోయే నెక్స్ట్ సినిమాలో కూడా సునీల్ క్యారెక్టర్ ఉంటుందని టాక్. చూడాలి మరి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేస్తారో..!!