Templates by BIGtheme NET
Home >> Cinema News >> దుబాయ్ బాత్రూమ్ లో జారి పడిపోయిందట

దుబాయ్ బాత్రూమ్ లో జారి పడిపోయిందట


ఓ వైపు బాత్రూమ్ లో జారి పడి గాయాలైనా మరోవైపు సాంగ్ షూట్ లో పాల్గొంది నభా నటేష్. ఆ ప్రమాదాన్ని ఏమాత్రం ఖాతరు చేయక తన కమిట్ మెంట్ తో మెప్పించింది. ఆ తర్వాత కేవలం రెండు వారాల విరామం మాత్రమే తీసుకుంది. పాట కోసం నృత్యాలు చేయాల్సి వచ్చింది. `సోలో బ్రాతుకే సో బెటర్`తో 2020 ను సంతోషంగా ముగించానని నభా చెబుతోంది. సంక్రాంతికి `అల్లుడు అదుర్స్`తో ట్రీటిచ్చేందుకు సిద్ధమవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి.. అలాగే 2020 క్రైసిస్ సంగతులు.. తదుపరి ప్రాజెక్టులపైనా ఈ భామ తాజా చిట్ చాట్ లో వెల్లడించిన సంగతులివి..

*నిజానికి మహమ్మారి లాక్ డౌన్ వల్ల ఎనిమిది నెలలు ఎవరూ సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా లేరు. అయితే నాకు 2020 చాలా మంచి విజయంతో ముగిసింది. సోలో బ్రతుకే సో బెటర్ తెలుగు సినీపరిశ్రమలో విడుదలైన మొదటి చిత్రం. ఇది భారతదేశంలోనే బాక్సాఫీస్ వద్ద ఆర్జించిన మొదటి చిత్రంగా నిలిచింది. 2021 సంక్రాంతికి `అల్లుడు అదుర్స్` విడుదలవుతుంది. ఇది పెద్ద ఎంటర్టైనర్ . సరైన పండుగ చిత్రం అవుతుంది.

*బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కష్టపడి పనిచేసే హీరో. అతను చాలా ఎనర్జిటిక్. గొప్ప డ్యాన్సర్ కూడా. అతను నాకు సలహాలిస్తూ ప్రతిసారీ స్ఫూర్తినిచ్చేవాడు. టైటిల్ ట్రాక్ కోసం బ్లాస్ట్ షూట్ చేశాం.

*నాకు దుబాయ్ లో ప్రమాదం జరిగింది. దుబాయ్ లోని వాష్ రూమ్ లో జారి పడిపోయాను. నేను తిరిగి రాగానే శస్త్రచికిత్స జరిగింది. నేను 2 వారాల విరామం తీసుకున్నాను. ఆ తర్వాత నేను పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. వెంటనే షూటింగ్ చేయాల్సి వచ్చింది. టీమ్ అంతా బాగా మద్దతు ఇచ్చారు.

*అను ఇమ్మాన్యుయేల్ తో 2-3 సన్నివేశాలకు కలిసి పనిచేశాను. సినిమా కోసం పనిచేసే ముందే ఒకరికొకరు మేం తెలుసు. ఈ చిత్రంలో మాకు భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంది. ప్రతి నటుడు ఈ ఫైటింగులో కనిపిస్తారు. మాకు ఈ ఫైట్ సీక్వెన్సులు పని తక్కువ కావడంతో స్పాట్ లో అనూ నేను రోజంతా కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం.

*నిథిన్ సరసన `అంధాధున్` రీమేక్ లో నటిస్తున్నాను. మరో తెలుగు సినిమా చేయనున్నాను. త్వరలో నా తమిళ అరంగేట్రం అప్ డేట్ ని కూడా చెబుతాను. ఇకపైనా గ్లామరస్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న చిత్రాల్లో నటిస్తాను..

.. అంటూ చిట్ చాట్ ని ముగించింది నభా..