బిబి4 : అవినాష్ కు అదే మైనస్ అంటున్న నాగబాబు

0

తెలుగు బిగ్ బాస్ లో రెండవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఎక్కువగా సింపతీతో నెగ్గుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పి సింపతీ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత తనకు ఇక్కడ నుండి బయటకు వెళ్తే జీవతం లేదు. జబర్దస్త్ నుండి నన్ను బయటకు పంపించారు. మళ్లీ వారు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నా జీవితం ఏంటీ అన్న రీతిలో డ్రామాను చేస్తున్నాడు. ఎలిమినేషన్ కు నామినేట్ అయన ప్రతి సారి కూడా అతడు చేస్తున్న సీన్ కాస్త ఓవర్ అనిపిస్తుంది.

ఇదే విషయాన్ని స్వయంగా నాగబాబు కూడా పేర్కొన్నాడు. అవినాష్ బాగానే ఆడుతున్నాడు. వాడు ఏడ్చే రకం కాదు. కాని వాడు అక్కడ ఏడుస్తుంటే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఇలా ఏడ్చుకుంటూ బిగ్ బాస్ లో నెగ్గుకు రావడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు. ఆ విషయాన్ని వాడు తెలుసుకోవడం లేదు. బిగ్ బాస్ లో అవినాష్ చేస్తున్న అతి పెద్ద తప్పు అదే అన్నట్లుగా నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు. అవినాష్ కు ఎవిక్షన్ పాస్ రావడంతో ఈ వారం సేవ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే వారం ఒక్క వారం సేవ్ అయితే ఖచ్చితంగా ఫైనల్ 5 లో అవినాష్ ఉంటాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నాగబాబు దృష్టిలో అభిజిత్ లేదా అవినాష్ విన్నర్ అవుతారు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు విన్నర్ అయినా కూడా తనకు హ్యాపీ అంటూనే అవినాష్ తప్పులు చేస్తున్నాడు అంటూ అభిజిత్ ను హైప్ చేశాడు. మీరు ఈ ఇద్దరిని కూడా ఫైనల్ 5కి తీసుకు వెళ్లండి ఫైనల్ విజేత ఎవరు అయినా పర్వాలేదు అంటూ నాగబాబు ఇండైరెక్ట్ గా వీరిద్దరికి తనవంతు సాయంగా ప్రమోట్ చేశాడు.