మహేష్-నమ్రత.. పిక్చర్-పర్ఫెక్ట్ లుక్ వైరల్

0

సూపర్ స్టార్ మహేష్ – నమ్రత శిరోద్కర్ వివాహం నుండి అరుదైన ఫోటో తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. నమ్రత స్వయంగా ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా అభిమానుల్లో వైరల్ గా మారింది. పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు.

నమ్రత తన పెళ్లి అయిన వెంటనే మామగారైన సూపర్ స్టార్ కృష్ణ.. భర్త మహేష్ సహా తన తల్లిదండ్రులతో కలిసి ఫోటో దిగారు. ఈ పెళ్లి ఫోటోలో నమ్రత తెల్లటి పట్టు చీరలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు.

మహేష్ బాబు తెల్లటి పట్టు ధోతి-కుర్తాలో సతీమణి తో కలిసి గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చారు. ఇక ఈ ఫోటోతో పాటు మరిన్ని నమ్రత ఇన్ స్టా ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారాయి. లేటెస్ట్ ఫోటోల్లో ఆ గ్రూప్ ఫోటో పిక్చర్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి. జీవితం ఒక సర్కిల్ లా తిరిగి మళ్లీ అక్కడికే వస్తుంది!! అంటూ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చారు నమ్రత.

ఇక మహేష్- నమ్రత జోడీ క్లాసిక్ రియల్ ప్రేమకథ గురించి చెప్పాల్సిన పనే లేదు. `వంశీ` మూవీ సెట్స్ లో తొలిసారి ఆ ఇద్దరూ కలుసుకున్నారు. ఆ క్రమంలోనే ప్రేమలో పడ్డారు. 2005 లో పెద్దల్ని ఒప్పించి నమ్రత శిరోద్కర్ ను మహేష్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు 2006 లో కొడుకు గౌతమ్ కు స్వాగతం పలికారు. కుమార్తె సితార 2012 లో జన్మించింది.

మహేష్ – నమ్రత టాలీవుడ్ ఆదర్శ జంటగానూ పాపులరయ్యారు. మహేష్ కి సంబంధించిన ప్రతిదీ నమ్రత పకడ్భందీగా ప్లాన్ చేసి ఇంత సక్సెస్ కి ఆసరా అయ్యారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా మహేష్ కుటుంబ జీవనాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ప్లాన్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గౌతమ్ సితారతోనే ఆయన ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాజమౌళి దర్శకత్వంలోనూ ఓ సినిమాకి కమిటైన సంగతి తెలిసినదే.