‘కోడి ముందా..? గుడ్డు ముందా..?’ ప్రశ్నకు జవాబు చెప్పిన మహేష్ భార్య

0

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం సెలబ్రిటీల భార్యలు కెమెరా ముందు కనిపించడం అరుదుగా జరుగుతుంది. అందులోను ఇంటర్వ్యూలంటే అసలే కనిపించరు. మరి ఆ సెలబ్రిటీ భార్య కూడా ఒకప్పటి హీరోయిన్ అయితే.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ కం సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్. ప్రస్తుతం మహేష్ బాబుకు భార్యగా.. ఇద్దరు పిల్లలు గౌతమ్ సితారలకు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక లాక్ డౌన్ సమయంలో ఎవరి ఫోటోలను వారు.. ఎవరి విషయాలు వారే షేర్ చేస్తే.. మహేష్ బాబు విషయాలు మాత్రం ఆయన భార్య నమ్రతనే షేర్ చేస్తుంది. నమ్రతకి మహేష్ అంటే అమితమైన ప్రేమ. పిల్లలంటే ప్రాణం. అదెలా అంటారా.. నమ్రత చేతి మీద టాటూలే అందుకు సాక్ష్యం అని చెప్పవచ్చు. అయితే నమ్రత శిరోద్కర్ ఒకప్పటి మిస్ ఇండియా టైటిల్ విజేత. నమ్రత టైటిల్ విన్నర్ పేరు ప్రకటించే టైంలోని చిన్న వీడియోను నమ్రత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే 1993లో నమ్రత మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. షోలో అడిగిన ప్రశ్నకు తన సమాధానంతో నమ్రత జడ్జీలను మెప్పించిందని వీడియో చూస్తే అర్ధమవుతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించింది. అయితే వీడియోలో మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ కనిపించారు. నమ్రత పూజా బాత్రా కర్మింధర్. అయితే ఫైనల్ రౌండ్ లో ఫైనల్ క్వశ్చన్ గా వీరికి పాత సామెతనే అడిగారు. కోడి ముందా..? గుడ్డు ముందా..? అనే ప్రశ్నకు ఎవరు సమాధానంతో మెప్పిస్తారో వారే విజేత అని చెబుతారు. అందులో నమ్రత.. “ఖచ్చితంగా కోడే ముందు.. ఎందుకంటే కోడి లేనిదే గుడ్డు లేదు కదా..” అని జవాబు చెప్పింది. నమ్రత జవాబుకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత జడ్జిలు నమ్రతనే విజేతగా ప్రకటించారు. ఈ వీడియో తన స్వీట్ మెమోరి అంటూ నమ్రత షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలో సూపర్ స్టార్ అభిమానులు అప్పటి నమ్రతను చూస్తూ మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ కపుల్ యంగే అనుకోండి.