నమ్రత వీడియో : మా పిల్లలు ఒలింపిక్స్ కు రెడీ

0

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమతి నమ్రత వ్యాపారలు ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబ వ్యవహారాలు పూర్తిగా ఆమె చూసుకుంటారు. ఒక ఉత్తమ గృహిణిగా నమ్రత ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. పిల్లలు మరియు భర్త విషయంలో ఆమె చూపించే శ్రద్ద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ గా తన పిల్లలు మరియు భర్తకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ లో తన ఇద్దరు పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

మా పిల్లలు ఒలంపిక్స్ కు రెడీ అవుతున్నారు. నేను వారికి ప్రతిదాంట్లో ప్రావిణ్యం ఉండాలని చెబుతూ ఉంటాను. ఆటలు మరియు స్విమ్మింగ్ వల్ల వ్యాయామం అవ్వడం మరియు మెదడు ఉత్తేజితం అవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. తన పిల్లల పట్ల నమ్రత చూపించే శ్రద్దకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. మహేష్ బాబు నమ్రతల తనయుడు గౌతమ్ మరియు కూతురు సితారలు అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు. ముఖ్యంగా సితార సోషల్ మీడియాలో అన్నయ్య గౌతమ్ కంటే కూడా కాస్త ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే.