బిగ్ బాస్ బ్యూటీ చాలా కష్టపడుతోంది

0

తెలుగు బిగ్ బాస్ లో సందడి చేసిన హీరోయిన్ నందిని రాయ్ అంతకు ముందు ఆ తర్వాత ఒకేలా అన్నట్లుగా ఉంది. బిగ్ బాస్ ఎంట్రీకి ముందు వరకు ఆమెకు పెద్దగా ఆఫర్లు వచ్చేవి కావు. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెను జనాలు అయితే గుర్తు పడుతున్నారు కాని సినీ పరిశ్రమ వారు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఆమె జోరు బాగానే ఉన్న సినిమాల పరంగా ఆఫర్లు రావడం లేదు. వచ్చిన ఏ ఒక్క ఆఫర్ ను కూడా వదలకుండా చేసేస్తున్న నందిని రాయ్ స్కిన్ షో విషయంలో ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.

ఇటీవల ఈమె మెట్రో కథలు అనే చిన్న వెబ్ మూవీలో నటించింది. ఆ సినిమాలో హాట్ గా నటించి అలరించింది. అయినా కూడా ఈమెకు ఇంకా ఆఫర్లు అనేవి అందని ద్రాక్ష మాదిరిగా ఉన్నాయి. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈమె అందాల ప్రదర్శణకు ఎప్పటిలాగే ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరి ఈసారి అయినా సినీ జనాలు ఎవరైనా ఈమెకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. అవకాశాల కోసం ఈ అమ్మడు పడుతున్న కష్టం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.