‘వి’ ట్రైలర్ టాక్

0

నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. నాని కెరీర్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆఫీసియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

కాగా ‘వి’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘హలో హలో హలో.. మైక్ టెస్టింగ్ 1 2 3.. 123..’ అంటూ నాని చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. ”జనరల్ గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసమే ఇలాంటి పనులు చేస్తుంటారు” అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో నాని సైకో పాత్రలో కనిపిస్తున్నాడని అర్థం అవుతోంది. ‘ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్ గా చేయాలనేదే నా పాలసీ..’ ‘ఇది సైడ్ బిజినెస్.. మెయిన్ బిజినెస్ వేరే ఉంది’ అని నాని చెప్తుండటంతో ఈ సినిమాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ట్రైలర్ లో ఫైట్స్.. చేజింగ్ సీన్స్ చూస్తుంటే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇక సుధీర్ బాబు విలన్ కోసం వేట కొనసాగించే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఓ సైకో కిల్లర్ – సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఛాలెంజింగ్ గా సాగే సినిమా కూడా తెలుస్తోంది. ఈ ట్రైలర్ లో ఆదితిరావు పాత్రను రివీల్ చేయలేదు. మొత్తం మీద ట్రైలర్ ‘మళ్ళీ ఎక్సపెక్టేషన్స్ కి మ్యాచ్ కాలేదనే మాట రాకూడదు’ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.

ఇక ‘వి’ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా అద్భుతమైన విజువల్స్ అందించినట్లు తెలుస్తోంది. జగపతిబాబు – వెన్నెల కిశోర్ – నాజర్ – అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వాస్తవానికి ‘వి’ సినిమాని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ‘వి’ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే మంచి డీల్ కుదరడంతో ‘వి’ మూవీని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేసినట్లు తెలుస్తోంది.