Templates by BIGtheme NET
Home >> Cinema News >> శ్యామ్ సింగ రాయ్’ మూవీని ప్రారంభిస్తున్న నాని..!

శ్యామ్ సింగ రాయ్’ మూవీని ప్రారంభిస్తున్న నాని..!


వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న నేచురల్ స్టార్ నాని.. ”శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో నాని డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఛాలెంజింగ్ రోల్ లో నటించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో రేపు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాగా ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూర్చానున్నాడు. ఇక నాని సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించనున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై నాని అభిమానుల తోపాటు సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్న నాని.. త్వరలోనే ల్ ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాడు.