Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘వి’ సినిమా విడుదల డేట్ ప్రకటించిన నేచురల్ స్టార్.. ఎప్పుడంటే..??

‘వి’ సినిమా విడుదల డేట్ ప్రకటించిన నేచురల్ స్టార్.. ఎప్పుడంటే..??


నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కొత్త సినిమా ‘వి’. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్ అతిథి రావు హైదరిలు హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలన్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఉగాదికే విడుదల కావాల్సిన సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. దేశం మొత్తం థియేటర్లు మూసివేయడంతో కొత్త సినిమాలన్నీ మూలన పడ్డాయి. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఓటిటిలే సినిమా థియేటర్లుగా మారాయి.

చిన్నసినిమా పెద్దసినిమా అనే తేడా లేకుండా దొరికిన సినిమాలన్నింటిని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బేరం కుదుర్చుకొని ఓటిటిలో ప్రదర్శిస్తున్నాయి. ‘వి’ సినిమా మేకింగ్ అప్పుడే చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు సినిమాను ఓటిటిలో విడుదల చేసేందుకు సిద్ధం చేసినట్లే అని తెలుస్తుంది. ఎందుకంటే థియేటర్లు ఓపెన్ అయ్యేలోపు ప్రేక్షకులు సినిమాను మర్చిపోతారని అనుకుంటున్నాడట. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే కుదిరేలా లేదని దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపితే వారు కూడా డిజిటల్ విడుదల బెటర్ అని అన్నారట. ఇక మళ్లీ ఇటీవలే నానితో ప్రస్తుత పరిస్థితులు వివరిస్తే మొత్తానికి నాని ఓటిటి విడుదలకు సానుకూలంగా స్పందించాడట.

ఇక దిల్ రాజు ‘వి’ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుండి భారీమొత్తంలోనే చెల్లించారట. తాజాగా హీరో నాని స్వయంగా ప్రకటించాడు. ఎన్నో అంచనాల మధ్య వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందని నాని క్లారిటీ ఇచ్చాడు. “ఈసారి రెగ్యులర్ లా కాకుండా డిజిటల్ అనుభూతి పొందండి. నా 25వ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఒక మెమొరబుల్ సినిమాగా ఉండబోతుంది. 12 సంవత్సరాలుగా నాకోసం థియేటర్లకు వచ్చారు. సెప్టెంబర్ 5న ఈసారి నేనే మీ ఇంటికి రాబోతున్నాను. రిలీజ్ డే గురించి నాకు కొంచం నెర్వస్ గా ఉంది. తప్పకుండా టక్ జగదీష్ తో థియేటర్లో కలుద్దాం” అంటూ ప్రకటించాడు. వి మూవీ కోసం నాని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.