నాగచైతన్య కొత్త మూవీలో ఆ హీరోయిన్ నటించట్లేదట..!!

0

అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే నాగచైతన్య మాత్రమే అని చెప్పాలి. గతేడాది మజిలీ సినిమాతో మంచి విజయం అందుకున్న చైతూ గ్యాప్ తీసుకొని చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చైతుకి జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక నాగచైతన్య ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందినీ రెడ్డితో ఒకటి అలాగే గతంలో మనం వంటి అద్భుతమైన సినిమా తీసిన విక్రమ్ కె.కుమార్ డైరెక్టర్ తో ఒక్కో సినిమా ఓకే చేశాడట. ఇక విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ‘థాంక్ యూ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. విక్రమ్ ఇంతవరకు చేసిన సినిమాలన్నిటి టైటిల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి.

ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డాడట విక్రమ్. కరోనా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. నిజానికి అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో హీరోయినుగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. రకుల్ పై వచ్చిన వార్తలన్నీ పుకార్లు అని సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం రకుల్ చేతిలో కేవలం డైరెక్టర్ క్రిష్ రూపొందించబోయే తెలుగు సినిమా ఒక్కటే ఉంది. ఇంకా ఏ సినిమా కూడా ఆమె ఓకే చేయలేదు. ఇక విక్రమ్ – చైతూ కాంబినేషన్ లో రాబోయే సినిమా పై అక్కినేని అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ‘థాంక్ యూ’ టీమ్ ఏం చేయనున్నారో..!!