ఆరు నెలల తర్వాత అమ్మనాన్నను కలిసిన అందాల రాక్షసి

0

లావణ్య త్రిపాఠి కరోనా లాక్ డౌన్ టైమ్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఈమెది స్వస్థలం డెహ్రాడూన్ కాగా జనవరిలో ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దాంతో అప్పటి నుండి హైదరాబాద్ లోనే లావణ్య త్రిపాఠి ఉంటోంది. దాదాపు ఆరు నెలల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసేందుకు లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ వెళ్లింది. తన జర్నీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

స్వాతంత్య్రంగా బతికేందుకు 16 ఏళ్ల వయసులోనే కుటుంబ సభ్యుల నుండి దూరంగా వచ్చేశాను. నాకు ఒంటరి తనం కుటుంబంకు దూరంగా ఉండటం కొత్తేం కాదు. కాని ఆరు నెలల పాటు వారికి దూరంగా ఉండటం మాత్రం ఇదే ప్రథమం. వారిని కలిసేందుకు చాలా ఆతృతగా ఎదురు చూశాను. జనవరిలో చివరిసారి నా కుటుంబ సభ్యులను కలిశాను. లాక్ డౌన్ టైమ్ ను వృదా చేయకుండా నాలో ఉన్న నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నాను. ఒంటరితనం అనేది నా మనసులో ఎప్పుడు రాకుండా నేను ఎప్పుడు బిజీగా ఉండేందుకు ప్రయత్నించాను.

ఇలాంటి సమయంలో ప్రయాణించేందుకు నేను చాలా భయపడ్డాను. డెహ్రాడూన్ ప్రయాణంకు నేను మొదట భయపడ్డాను. పీపీఈ కిట్ మరియు జాగ్రత్తలు పాటించి డెహ్రాడూన్ చేరుకున్నాను. చేరుకున్న వెంటనే కరోనా టెస్టు చేయించుకున్నాను. నెగటివ్ వచ్చినా కూడా కుటుంబ సభ్యులకు కాస్త దూరంగానే ఉంటున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం ఈమె ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. మరో వైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. వచ్చే నెలలో మళ్లీ ఈమె హైదరాబాద్ కు రానున్నట్లుగా తెలుస్తోంది.