నాగేంద్రబాబు- పద్మజ కొణిదెల దంపతుల కుమారుడు వరుణ్ తేజ్.. దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇటలీ- సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. వీరంతా ఇప్పటికే వెడ్డింగ్ వెన్యూ వద్దకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు […]
ఆర్ ఎక్స్100 ఫేమ్ కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా రాబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీవాసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో.. ప్రమోషన్ పై ఫుల్ ఫోకస్ చేసిన యూనిట్.. డిఫరెంట్ స్టైల్లో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న ఉన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ అభినయం.. అందమైన రూపం ఆకట్టుకుంది. ఈ క్రమంలో లావణ్య నటించిన ‘భలే భలే మగాడివోయ్’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గతేడాది వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ తో […]
‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఫస్ట్ సినిమాలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న ఉన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ.. అభినయం ఆకర్షణీయమైన రూపం అందరినీ ఆకట్టుకుంది. ‘భలే భలే మగాడివోయ్’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాలు లావణ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక గతేడాది వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే పర్ఫార్మెన్స్ రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ […]
అందాల రాక్షసి సినిమా వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా ఇంకా లావణ్య త్రిపాఠి అంటే రాక్షసి అంటూనే చాలా మంది గుర్తు పడుతున్నారు అంటే ఆమె కెరీర్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫ్రస్టేషన్ తోనో లేదా మరేంటో కాని సోషల్ మీడియాలో ఆమె ఇటీవల తన అభిమానులపై అసహనం వ్యక్తం చేసింది. కోపంతో అభిమానులకు రివర్స్ కౌంటర్ వేస్తూ ప్రశ్నించిన వారిపై పవర్ పంచ్ వేసినంత పని చేసింది. ఇంతకు నెటిజన్స్ ఆమెను […]
‘అందాల రాక్షసి’ మూవీతో సొట్టబుగ్గల సుందరీ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షలకు పరిచయమైంది. ఈ మూవీ హిట్టుతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడంతో పనైపోయిందని అనుకున్నారంతా.. ఈ క్రమంలోనే ఆమె దర్శకుడు మారుతి పర్యవేక్షణలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాను వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అంటూ అలెర్ట్ […]
కరోనా మహమ్మారీ మనిషి ఆశల్ని చంపేసింది. ఎందరినో డైలమాలో పెట్టేసింది. టాలీవుడ్ అల్లకల్లోలంగా మారిపోవడంతో ఇక్కడ కెరీర్ ఆశలతో వచ్చిన ఎందరికో అది అశనిపాతమే అయ్యింది. డెబ్యూ హీరోయిన్లు అప్ కమింగ్ స్టార్లు..యువ నాయికలు.. కొత్త నిర్మాతలు.. ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ఇలా అందరి ఆశల్ని అడియాశలే చేసింది మహమ్మారీ. పెద్దోళ్లంతా ఓడలు బళ్లయ్యాయి అంటూ కలతలో ఉన్నారు. ఈ పరిస్థితి ఊహించనిది. ఊహాతీతమైన ముప్పులా ఉరుములా మీద పడింది రాకాశి. ఇంక ఇదే కరోనా అందాల […]
అందం ఉంది.. వేడి ఉంది. అంతకుమించి గ్లామర్ ని ఎక్స్ పోజ్ చేసే స్టింటూ బాడీలో ఉంది. అన్నీ ఉన్నా కానీ ఎందుకనో ఈ ఏడెనిమిదేళ్ల కెరీర్ లో ఆశించిన ఎత్తుకు ఎదగలేకపోయింది. టాలీవుడ్ లో ఎందరో నవతరం నాయికలు పెద్ద రేంజుకు ఎదిగేస్తున్నారు తన కళ్ల ముందే. కీర్తి సురేష్.. రాశీఖన్నా.. నివేద థామస్ వీళ్లంతా ఎదిగారు. నిన్నగాక మొన్ననే బరిలో దిగి రష్మిక మందన ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ ఎందుకనో లావణ్య […]
లావణ్య త్రిపాఠి కరోనా లాక్ డౌన్ టైమ్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఈమెది స్వస్థలం డెహ్రాడూన్ కాగా జనవరిలో ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దాంతో అప్పటి నుండి హైదరాబాద్ లోనే లావణ్య త్రిపాఠి ఉంటోంది. దాదాపు ఆరు నెలల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసేందుకు లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ వెళ్లింది. తన జర్నీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా […]