అంత చిన్న విషయానికి ఇంత సీరియస్ ఎందుకు రాక్షసి

0

అందాల రాక్షసి సినిమా వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా ఇంకా లావణ్య త్రిపాఠి అంటే రాక్షసి అంటూనే చాలా మంది గుర్తు పడుతున్నారు అంటే ఆమె కెరీర్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫ్రస్టేషన్ తోనో లేదా మరేంటో కాని సోషల్ మీడియాలో ఆమె ఇటీవల తన అభిమానులపై అసహనం వ్యక్తం చేసింది. కోపంతో అభిమానులకు రివర్స్ కౌంటర్ వేస్తూ ప్రశ్నించిన వారిపై పవర్ పంచ్ వేసినంత పని చేసింది. ఇంతకు నెటిజన్స్ ఆమెను అడిగింది ఏంటో తెలుసా.. పెళ్లి గురించి ఔను లావణ్య త్రిపాఠిని పెళ్లి గురించి ప్రశ్నించిన సమయంలో కోపం వచ్చింది.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె చేతికి ఉన్న రింగ్ చూసిన అభిమాని ఒకరు మేడమ్ మీరు ఎంగేజ్డా అంటూ ప్రశ్నించాడు. దాంతో ఆమె కాస్త సీరియస్ అయ్యి అమ్మాయిలు కనీసం సొంతంగా ఉంగరాలు కూడా కొనుక్కోలేరా.. అమ్మాయిలు ఉంగరం పెట్టుకుంటే పెళ్లి అయినట్లు లేదా పెళ్లి చేసుకోబోతున్నట్లేనా అంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత మళ్లీ కొద్ది సమయంకు అక్క మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా మరోసారి లావణ్య త్రిపాఠి హైపర్ చూపించింది. ఈ ప్రశ్నను మా అమ్మానాన్నలే ఇంకా నన్ను అడగలేదు. నీకెందుకు అంటూ ఎదురు ప్రశ్నించింది.

నెట్టింట ఇలాంటి ప్రశ్నలు చాలా కామన్.. విసుగు తెప్పించే ప్రశ్నలతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. వాటిని లైట్ తీసుకోవాలి లేదంటే ఫన్నీగా సమాధానం చెప్పాలి.. అలా కాదని కౌంటర్ ఇస్తే ఉడికించేందుకు మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అందుకే అలాంటి ప్రశ్నలను లైట్ తీసుకోవాలి అప్పుడే ఇలాంటివి మళ్లీ మళ్లీ ఎదురు కావు. ఈ అందాల రాక్షసి ఈ విషయాన్ని ఇంకా ఎప్పటికి తెలుసుకుంటుందో ఏమో..!