చరణ్ ని పోలీసుగా చూపించిన జక్కన్న.. తారక్ ని అలా చూపిస్తాడా…?

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా.. ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియోలో చరణ్ ని పోలీసుగా పరిచయం చేసేశాడు రాజమౌళి. రామ్ చరణ్ రోల్ ని వీర లెవల్లో ఎలివేట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో అత్యధిక లైక్స్ సాధించిన వీడియోగా నిలిచింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ స్పెషల్ వీడియో ‘రామరాజు ఫర్ భీమ్’ అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రని జక్కన్న ఎలా పరిచయం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ కి చరణ్ ఇవ్వబోయే గిఫ్ట్ కోసమే ముందుగా 10 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. చరణ్ ని పోలీస్ గా చూపించి సక్సెస్ అయిన రాజమౌళి.. ఎన్టీఆర్ ని ‘బందిపోటు దొంగ’లా చూపిస్తారని అనుకుంటున్నారు. తెలంగాణ విప్లవకారుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న తారక్.. ఈ సినిమాలో అనేక గెటప్స్ లో కనిపిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ చేయబోయే టీజర్ లో ఆ గెటప్ కూడా కనిపించే అవకాశం ఉంది. అలానే అందరికీ తెలిసిన కొమరం భీమ్ గెటప్ కూడా చూపిస్తారని తెలుస్తోంది. మరి జక్కన్న ఎన్టీఆర్ ని ఎలా పరిచయం చేయబోతున్నాడో తెలియాలంటే అక్టోబర్ 22న ‘రామరాజు ఫర్ భీమ్’ విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.