‘ది వైట్ టైగర్’.. పింకీగా మారిన ప్రియాంక చోప్రా

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కరోనా లాక్ డౌన్ తర్వాత మొదటిసారి షూటింగ్ కు హాజరయ్యారు. దాదాపు మార్చి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోయింది. అప్పటినుంచి తారలంతా ఇంటికే పరిమితమైపోయారు.

అయితే తాజాగా ప్రియాంక షూటింగ్ లోకి అడుగుపెట్టింది. ప్రియాంకచోప్రా ప్రధాన పాత్రలో ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ నిర్మిస్తున్న ‘ది వైట్ టైగర్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

భారత రచయిత అరవింద్ అడిగా రాసిన ఫేమస్ నవల ‘ది వైట్ టైగర్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు రమిన్ బహ్రాని దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ లోకేషన్ నుంచి కొన్ని ఫొటోలను ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది వైట్ టైగర్ లో నటిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

‘ది వైట్ టైగర్’ నవల న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 2008లో బ్యాన్ బుకర్ ప్రైజ్ గెలిచింది. ఈ నవలలోని కీలకమైన పింకీ పాత్రలో ప్రియాంక నటిస్తోంది. రాజస్థాన్ లోని ‘లక్ష్మణ్ గఢ్’ అనే గ్రామానికి చెందిన బల్ రామ్ హల్వాయ్ అనే వ్యక్తి చుట్టూ తిరగే ఈ కథాంశంతో నవల కొనసాగుతోంది. రాజ్ కుమార్ రావు ఆదర్స్ గౌరవ్ లు సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.