బిబి4 : ఈసారి మొత్తం లవ్ ట్రాక్స్ పైనే దృష్టి

0

బిగ్ బాస్ అంటేనే ఎమోషన్స్.. లవ్.. గొడవలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కో సీజన్ లో ఒకొక్కటి హైలైట్ అవుతూ ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్కటి కూడా హైలైట్ కాకుండా సాదా సీదాగా షో కొనసాగితే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ ను ఎప్పుడు చూపించడానికి సాధ్యం అవ్వదు. అందుకే హౌస్ మెంట్స్ మద్య లవ్ ట్రాక్ నడిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఏం జరుగుతుంది.. ఏం జరుగబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతుంది. కొందరు ఆ ట్రాక్ ను ఎంజాయ్ చేస్తూ చూస్తే మరికొందరు తిట్టుకుంటూ చూస్తూ ఉంటారు. మొత్తానికి హౌస్ లో లవ్ ట్రాక్ అనేది నడిస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అనేది గత సీజన్ లను బట్టి అర్థం అవుతుంది. అందుకే ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో లవ్ ట్రాక్ లను సాధ్యం అయినంత ఎక్కువగా సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తం అందరికి కాకున్నా ఒక్కరు ఇద్దరికి ముందే లవ్ ట్రాక్ ఖచ్చితంగా నడిపించాలంటూ సూచించి ఉంటారని అనిపిస్తుంది. మోనాల్ విషయంలో ఇది చాలా ఎక్కువగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆమె అఖిల్ మరియు అభిజిత్ లతో సమానమైన రిలేషన్ షిప్ ను ట్రై చేసింది. రెండు మూడు వారాల పాటు ఆ ట్రైయాంగిల్ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే అది కాస్త శృతి మించడంతో అభిజిత్ సైట్ అయ్యాడు. అఖిల్ లైట్ లైట్ గా ఆమెతో టచ్ లో ఉంటున్నాడు. ఒక వైపు మోనాల్ అఖిల్ ల లవ్ ట్రాక్ ను హైలైట్ చేస్తూనే మరో వైపు అవినాష్ మరియు అరియానాల మద్య ఏదో జరుగుతుంది అని ప్రేక్షకులను నమ్మించేందుకు వారిద్దరి మద్య జరిగే చిన్న చిన్న విషయాలను సైతం చూపించేందుకు ఎడిటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక అభిజిత్ మరియు హారికల మద్య మంచి కనెక్షన్ అయితే ఏర్పడింది. అది ఎలాంటి కనెక్షన్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాని ఖచ్చితంగా ఒక మంచి కనెక్షన్ మాత్రం ఉందంటూ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ బాండ్డింగ్ విషయంలో ప్రేక్షకులు కూడా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అభిజిత్ విషయంలో అరియానా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్న విషయాన్ని కూడా బిగ్ బాస్ టీం హైలైట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ప్రేక్షకులను కేవలం లవ్ ట్రాక్స్ తోనే ఆకట్టుకునేందుకు ఈసారి బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ట్రాక్స్ ముందు ముందు ఎక్కడికి దారి తీస్తాయా అంటూ ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.