అరుదైన ఫీట్ సాధించిన అందాల రాక్షసి..!

0

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న ఉన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ అభినయం.. అందమైన రూపం ఆకట్టుకుంది. ఈ క్రమంలో లావణ్య నటించిన ‘భలే భలే మగాడివోయ్’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గతేడాది వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ డెహ్రాడూన్ బ్యూటీ.. ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా మధ్యమాలలో అరుదైన ఫీట్ అందుకుంది.

తాజాగా లావణ్య త్రిపాఠి ఇన్స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ అయింది. ఇప్పటికే ట్విట్టర్ లో మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్న లావణ్య ను ఫేస్ బుక్ లో 2.6 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటో షూట్స్ లో ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని అట్రాక్ట్ చేస్తూ వస్తున్న బ్యూటీ.. ఇప్పుడు ఈ మైల్ స్టోన్ ని రీచ్ అయింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి.. సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్సప్రెస్’ మరియు కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో లావణ్య యంగ్ విడో మల్లిక గా నటించనుంది. ‘ఏ1 ఎక్సప్రెస్’ లో హాకీ ప్లేయర్ గా కనిపించనుంది.