మాస్టర్ ఓటీటీలోనా..? అస్సలు వద్దంటున్న విజయ్ ఫ్యాన్స్..

0

ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాపై వస్తున్న ఓ తాజా అప్డేట్తో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారట. నిజానికి మాస్టర్ చిత్రం గత వేసవిలోనే రిలీజ్ కావల్సింది. కానీ కరోనా లాక్డౌన్తో ఆగిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలు ఒక్కోటీ సడలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకొనేందుకు కూడా అనుమతులు వచ్చాయి. దీంతో మాస్టర్ సినిమా దీపావళికి వచ్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అదంతా పుకారే అని తేలిపోయింది.

మాస్టర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేస్తే ఆశించిన లాభాలు రావు. సినిమా హిట్ అయితే అంతో ఇంతో వస్తాయి. కానీ పొరపాటున బ్యాడ్ టాక్ వచ్చిందంటే నిర్మాత ఎంతో నష్టపోతాడు. కాబట్టి సమయం చూసి రిలీజ్ చేస్తారు. ఒక వేళ డివైడ్ టాక్ వచ్చినా కొంతమేర లాభాలైనా వస్తాయి. వివిధ కారణాలతో సినిమా దీపావళికి రాలేదు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ బయటకొచ్చింది. ఇందులోని సన్నివేశాలు మాస్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. విజయ్ సేతుపతి.. విజయ్ మధ్య వచ్చిన సీన్స్తో దళపతి అభిమానులకు పూనకాలు వచ్చేసాయట. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఓ వార్త బయటకు వచ్చింది. థియేటర్లలో ఈలలు వేస్తూ.. ఎంజాయ్ చేస్తూ చూద్దామనుకున్న అభిమానులకు ఈ వార్త నచ్చడం లేదట. తాజాగా ఈ విషయంపై హీరోయిన్ రాధిక కూడా ఓ కామెంట్ పెట్టింది. ‘ మాస్టర్ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుందని వింటున్నాను.. నాకైతే ఈ సినిమా థియేటర్లోనే చూడాలని ఉంది.. మరి మీకు’ అంటూ విజయ్ ఫ్యాన్స్ను ప్రశ్నించింది. దీంతో చాలా మంది రాధికతో ఏకీభవిస్తున్నారు. మరికొందరేమో ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్లో చూడటం అవసరమా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న మాస్టర్పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.