ఆ ఫేక్ న్యూస్ నమ్మకండి: లావణ్య త్రిపాఠి

0

‘అందాల రాక్షసి’ మూవీతో సొట్టబుగ్గల సుందరీ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షలకు పరిచయమైంది. ఈ మూవీ హిట్టుతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడంతో పనైపోయిందని అనుకున్నారంతా.. ఈ క్రమంలోనే ఆమె దర్శకుడు మారుతి పర్యవేక్షణలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి.

అయితే తాను వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అంటూ అలెర్ట్ గా ఉండాలంటూ ఆమె అభిమానులకు ట్వీట్ చేసింది.

త్వరలోనే తాను మూడు సినిమాల్లో నటిస్తున్నానని.. వెబ్ సిరీస్ లలో చేయడం లేదని లావణ్య క్లారిటీ ఇచ్చింది. విధి నిర్ణయించినప్పుడల్లా దర్శకుడు మారుతి సార్ తో కలిసి పనిచేస్తానని చివర్లో ట్విస్ట్ ఇచ్చింది.