Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం

వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం


1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ఉండి తపించాడని.. సరైన అవకాశం దక్కించుకొని ‘శివ’తో ఇండస్ట్రీని షేక్ చేశాడని మెగా బ్రదర్ నాగబాబు కొనియాడారు. ‘మా చానెల్ మా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో తాజాగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన సినీ ప్రముఖుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. టాలెంట్ ఉన్నవాడిని ఎవరూ ఆపలేరంటూ ఉదాహరణలతో నాగబాబు వివరించారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఎదిగిన తీరును నాగబాబు వివరించారు.

రాంగోపాల్ వర్మ నాన్న గారు అన్నపూర్ణలో పనిచేస్తున్నారని.. అలా అప్పటి స్టార్ హీరో నాగార్జునను అప్రోచ్ అయ్యి ఆయన సూచన మేరకు ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్మ చేశాడని నాగబాబు వివరించారు. అప్పటికే వర్మకు ఫిల్మ్ మేకింగ్ లో విపరీతమైన అవగాహన ఉందని.. శివ సినిమాతో ఒక సంచలనం సృష్టించాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆరోజు వర్మ తీసిన సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ సినిమాగా నిలిచిందని.. ఇలా కూడా సినిమాలు తీయవచ్చా.. ఇంత రియలిస్టిక్ గా అని వర్మ అందరినీ ఆశ్చర్యపరిచాడని అన్నారు.

సో శివ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదని..తనదంటూ గొప్ప మార్క్ ను సినిమా ఇండస్ట్రీపై క్రియేట్ చేశాడని నాగబాబు అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో రైటర్లకు చాలా డిమాండ్ ఉందని.. వారి సృజనాత్మకతే సినిమాలను నడిపిస్తోందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. రైటర్లు ఇండస్ట్రీలో కొరత ఉందని.. రైటర్లు అంతా దర్శకులు అయిపోయి రైటింగ్ తగ్గించారన్నారు.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా కేవలం టాలెంట్ తపనతో పైకి ఎదిగిన వారు ఎందరో ఉన్నారని.. సాయి మాధవ్ బుర్రా లాంటి రచయితలు ఇందుకు ఉదాహరణ అని.. పలువురు హాలీవుడ్ దర్శకులు కూడా తపనతో పైకి ఎదిగారని నాగబాబు చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన అవసరం లేకపోయినా సరే మనమే ఒక అవసరాన్ని సృష్టించగలగడం చేయాలని.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వారికి నాగబాబు సలహా ఇచ్చారు.