అందుకేగా అందాల రాక్షసి అన్నారు

0

అందం ఉంది.. వేడి ఉంది. అంతకుమించి గ్లామర్ ని ఎక్స్ పోజ్ చేసే స్టింటూ బాడీలో ఉంది. అన్నీ ఉన్నా కానీ ఎందుకనో ఈ ఏడెనిమిదేళ్ల కెరీర్ లో ఆశించిన ఎత్తుకు ఎదగలేకపోయింది. టాలీవుడ్ లో ఎందరో నవతరం నాయికలు పెద్ద రేంజుకు ఎదిగేస్తున్నారు తన కళ్ల ముందే. కీర్తి సురేష్.. రాశీఖన్నా.. నివేద థామస్ వీళ్లంతా ఎదిగారు. నిన్నగాక మొన్ననే బరిలో దిగి రష్మిక మందన ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ ఎందుకనో లావణ్య త్రిపాఠి మాత్రం అన్నీ ఉన్నా ఏదీ కాలేకపోతోంది.

ఇటీవల నటించిన సినిమాలేవీ ఆశించిన సక్సెస్ సాధించకపోవడమే అందుకు కారణం కావొచ్చు. అప్పట్లో ఓ అగ్ర హీరో ఆఫర్ చేసిన దానిని కాదనుకోవడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చేమో. ప్రయత్న లోపమా లేక ఇంకేదైనానా? ఏదేమైనా ఈ డెహ్రాడూన్ బ్యూటీ కెరీర్ పరంగా ఎక్కడో ఏదో తప్పిదం జరిగిందనే భావించాలి.

నిఖిల్ సరసన అర్జున్ సురవరం చిత్రంలో నటించింది లావణ్య. ఆ సినిమా హిట్టయినా తనకు కలిసొచ్చిందేం లేదు. ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన `ఏ1 ఎక్స్ ప్రెస్` అనే చిత్రంలో నటిస్తోంది. క్రైసిస్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక లావణ్య ఫోటోషూట్ల స్టంట్ గురించి చెప్పేదేం ఉంది.

ఏదో ఒక సాయంత్రం కాఫీకని వెళితే రిలాక్స్ డ్ గా ఉన్న సమయంలో కెమెరా అలా క్లిక్ మనిపించినట్టుంది. లావణ్య ఇలా యాథృచ్ఛికంగానే అలా చేతులెత్తేస్తుంటే.. ఆ గళ్ల చొక్కా అలా తేలగానే నడుము కొలతలపై కన్నేసింది యూత్. మరీ అలా బెల్లీ ఫ్యాట్ అదుపుతప్పి పెరిగితే ఎలా రాక్షసీ..? కాస్త జిమ్ చేసి తగ్గించవచ్చు కదా! అని సలహా ఇస్తున్నారు. మునుపటితో పోలిస్తే కాస్త బొద్దెక్కి కనిపిస్తోంది ఈ ఫోటోలో.