ముంబై టు హైదరాబాద్ రకుల్ ఇదిగో ఇలా..

0

మన్మథుడు 2 రిలీజై అప్పుడే ఏడాది అయ్యింది. 2019 ఆగస్టులో రిలీజైన ఆ సినిమా రిజల్ట్ ఏమిటో తెలిసిందే. ఊహించని డిజాస్టర్ నాగార్జున సహా రకుల్ ప్రీత్ లో కలవరానికి కారణమైంది. రకుల్ అయితే ఆ తర్వాత టాలీవుడ్ సర్కిల్స్ లో సరిగా కనిపించలేదు. మన్మథుడు 2లో రకుల్ నటనకు కూడా క్రిటిక్స్ సరిగా మార్కులే వేయకపోవడం అతి పెద్ద నిరాశనే మిగిల్చింది. కారణం ఏదైనా.. సినిమాలు తగ్గాయి.

ఇక ఇటీవల క్వారంటైన్ సమయాన్ని తన సోదరుడు సహా కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఆసక్తిని కనబరిచింది. ప్రస్తుతం కరోనా మహమ్మారీ కారణంగా భారతీయుడు 2 షూటింగు వాయిదా పడింది. ఇటీవలే వేరొక తెలుగు సినిమాలోనూ నటిస్తూ బిజీ అయ్యింది. ఇటీవల కొంత కాలంగా హైదరాబాద్ లోనే ఉంటోంది. అటు తమిళ సినిమా కూడా చేస్తోంది. మొత్తానికి కరోనా క్రైసిస్ ఉధృతి కొనసాగుతున్న ఈ సీజన్ లో అందరికంటే ముందే డేర్ చేసి సెట్స్ కి వెళుతున్న నాయికగా రకుల్ పేరు మార్మోగుతోంది. వరుస సినిమాలతో రకుల్ బిజీ బిజీగా మారుతోంది.

ఇక ఇటీవల ఎయిర్ లైన్స్ వాళ్లు విమానాల సంఖ్యను పెంచారు. అన్ లాక్ 4.0 లో మరింత వెసులుబాటు ఉండనుంది. ఆ క్రమంలోనే ముంబై టు హైదరాబాద్.. హైదరాబాద్ టు ముంబై .. చెన్నయ్ ప్రయాణించేందుకు రకుల్ డేర్ చేస్తోంది. ఇదిగో ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే కెమెరా కంటికి చిక్కిందిలా. మాస్క్ పెట్టుకున్నా వైట్ అండ్ బ్లూ డెనిమ్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించింది. వైట్ టాప్ బ్లూ షేడ్ డెనిమ్స్ కి కాంబినేషన్ గా ఆ బ్లాక్ గాగుల్ స్టైల్ అదిరిపోయింది కదూ?