కీర్తి రియల్ లైఫ్ లో కూడా ‘మహానటి’నే ఫాలో అవుతోందా…

0

టాలీవుడ్ లో ‘మహానటి’గా స్థిరపడిపోయింది కీర్తి సురేష్. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి ‘నేను లోకల్’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డును కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. కీర్తి ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖి’ ‘రంగ్ దే’ ‘అన్నాతే’ ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ ‘సాని కాయిదం’ ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలలో నటిస్తోంది.

అయితే కెరీర్ ని ఇంత చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లో మరో స్టెప్ వేయబోతోందట. అందేంటంటే కీర్తి సురేష్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతోందట. కీర్తి తమిళ్ లో వెబ్ సిరీస్ నిర్మించనుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి ఇప్పుడు సావిత్రి లాగే కెరీర్ ప్లాన్ చేసుకోబోతోంది అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ నిర్మాతలుగా మారి సక్సెస్ అయ్యారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఛార్మీ కౌర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సైతం సినిమాలు నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీలో ‘పెంగ్విన్’ సినిమాని రిలీజ్ చేసి ఓటీటీ ఆడియన్స్ కి దగ్గరైన కీర్తి.. ఇప్పుడు వారి కోసం వెబ్ సిరీస్ నిర్మించనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.