అందాల రాక్షసిని మింగేసిన కరోనా రాకాశి

0

కరోనా మహమ్మారీ మనిషి ఆశల్ని చంపేసింది. ఎందరినో డైలమాలో పెట్టేసింది. టాలీవుడ్ అల్లకల్లోలంగా మారిపోవడంతో ఇక్కడ కెరీర్ ఆశలతో వచ్చిన ఎందరికో అది అశనిపాతమే అయ్యింది. డెబ్యూ హీరోయిన్లు అప్ కమింగ్ స్టార్లు..యువ నాయికలు.. కొత్త నిర్మాతలు.. ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ఇలా అందరి ఆశల్ని అడియాశలే చేసింది మహమ్మారీ. పెద్దోళ్లంతా ఓడలు బళ్లయ్యాయి అంటూ కలతలో ఉన్నారు. ఈ పరిస్థితి ఊహించనిది. ఊహాతీతమైన ముప్పులా ఉరుములా మీద పడింది రాకాశి.

ఇంక ఇదే కరోనా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని డైలమాలో పడేసిందని ఓ గుసగుస వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠికి గత కొంతకాలంగా సక్సెస్ లేకపోయినా అడపాదడపా యువహీరోల సరసన అవకాశాలొస్తున్నాయి. పని అయిపోయిందిలే అనుకుంటుండగా.. ఈ డింపుల్ బ్యూటీ రెండు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. సందీప్ కిషన్ సరసన `ఏ1 ఎక్స్ ప్రెస్` అనే సినిమాలో నటిస్తోంది. అలానే `చావు కబురు చల్లగా` అనే మరో బడ్జెట్ చిత్రంలో నటిస్తోంది.

అయితే ఇవి పూర్తయినా నెక్ట్స్ ఏంటి? అన్నదే సందిగ్ధం. ఇప్పట్లో థియేటర్స్ తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఈ రెండు సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయి అన్నదానిపై క్లారిటీ లేదు. మేకింగ్ పరంగానే ఇవి రెండూ ఆలస్యమవుతున్నాయి. అందుకే ఈ బ్యూటీ వెబ్ సిరీస్ ల పై కాన్సన్ ట్రేట్ చేయాల్సిందేనని సూచిస్తున్నారు నిపుణులు. ఈ బ్యూటీ హాట్ గా కనిపించే ఆఫర్లు కావాలని డైరెక్టర్స్ ని ఆ తరహా పాత్రలు ఇవ్వమని అడుగుతోందట. గ్లామర్ ఆవిష్కరణకు స్కోప్ వెబ్ సిరీస్ లో ఉంటుందిగా..! మరి లావణ్య నెక్ట్స్ స్టెప్ ఇదేనేమో కాస్త ఆగితే కానీ తెలీదు.