ఆ కేసుతో ప్రదీప్ కు సంబంధం లేదు!

0

పంజాగుట్టా స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేరారంటూ ఫిర్యాదు చేసిన యువతి నేడు మరోసారి మీడియా ముందుకు వచ్చింది. మంద కృష్ణ మాదిగతో పాటు దళిత గిరిజన సంఘాల నాయకులు కూడా ఆమెతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాట్లాడుతూ యువతిని డాలర్ బాబు అనే వ్యక్తి బలవంతం చేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెతో అబద్దం ఆడించాడు. మొత్తం 139 మంది పేర్లు అందులో చెప్పనప్పటికి కేవలం 30 శాతం మంది మాత్రమే ఈ కేసులో కీలక నింధితులు అంటూ ఆయన పేర్కొన్నారు. డబ్బు లాగే ప్రయత్నం చేయడంతో పాటు మరేదో దురుద్దేశ్యంతో డాలర్ బాబు ఆమెతో ఈ పని చేయించాడు.

139 మందిలో దాదాపుగా 40 శాతం మందికి అసలు ఈ కేసుతో సంబంధం లేదు. యాంకర్ ప్రదీప్ కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని కవిత గారి పీఏ సంతోష్ రావుకు కూడా ఇందులో ఎలాంటి ప్రమేయం లేదంటూ మంద కృష్ణ మాదిగ పేర్కొన్నాడు. ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ.. తాను మోసపోయిన మాట వాస్తవమే. చాలా మంది తనపై అఘాయిత్యం చేసిన మాట కూడా వాస్తవమే. కాని 139 మంది మాత్రం కాదని పేర్కొంది. అందులో కొందరి పేర్లు రెండు సార్లు రావడంతో పాటు కొందరికి సంబంధం లేకున్నా కూడా డాలర్ బాబు కావాలని నాతో వారి పేర్లు చెప్పించాడు.

నా వల్ల వారు ఇబ్బంది పడటం ఇష్టం లేదు. అయినా కూడా నా కుటుంబ సభ్యులను బెదిరించి చంపేస్తామంటూ హెచ్చరించడంతో అలా చెప్పానంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి యాంకర్ ప్రదీప్ కు ఈ కేసుతో సంబంధం లేదు అంటూ తేలిపోవడం తోఆయన అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రదీప్ ను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన డాలర్ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయాలంటూ దళిత గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక తనకు క్లీన్ చీట్ రావడంపై ప్రదీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.