సంక్రాంతి సంబరాల్లో ‘నారప్ప’.. పోస్టర్ రిలీజ్

0

తమిళంలో ధనుష్ హీరోగా 2019లో వచ్చిన మూవీ ‘అసురన్’. సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నిస్తూ సాగిన ఈ మూవీ కోలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. కలైపులి ఎస్ థాను సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వాస్తవంగా ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్దాలను దర్శకుడిగా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కారణం.. ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు అడ్డాల. జీవితంలో ప్రేమ శాంతి ఆనందం కథావస్తువులుగా ఆయన సినిమాలు తెరకెక్కుతుంటాయి. అలాంటిది.. అసురన్ సినిమాను శ్రీకాంత్ ఎలా హ్యాండిల్ చేస్తాడనే సందేహం అందరినీ తొలిచింది.

‘అసురన్’ సినిమాలో యాక్షన్ ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది. వాస్తవ జీవితాలను ప్రతిబింబిస్తూ సాగుతుందీ చిత్రం. దర్శకుడు వెట్రిమారన్ అద్భుతంగా.. hRద్యంగా తెరకెక్కించారు. మరి అలాంటి తీవ్రమైన యాక్షన్ డ్రామాను శ్రీకాంత్ అడ్డాల ఎలా తీస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. సంక్రాంతి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశాడు దర్శకుడు. అయితే.. ఇందులోనూ తన ఫ్యామిలీ మార్కు ఎలివేట్ చేయడం విశేషం. తన కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ఉన్న నారప్ప ఫ్యామిలీ ఫొటోను చూపించిన శ్రీకాంత్.. ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ చిత్రంలో వెంకటేష్ ప్రియమణి భార్యాభర్తలుగా నటించారు. C/o కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ పెద్ద కొడుకుగా నటించారు. నారప్ప కుటుంబంలో మరో కొడుకుతోపాటు చిన్న కుమార్తె కూడా ఉంది.