Templates by BIGtheme NET
Home >> Cinema News >> www టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

www టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు


దర్శకుడిగా మారిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ రూపొందించిన తాజా చిత్రం WWW (హూవేర్వై). కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘118’ చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన గుహన్.. WWWతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీ టీజర్ ను ప్రిన్స్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్ను సూపర్స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్స్. సైబర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

కేవీ గుమన్ కు ఇది రెండో చిత్రం. ఇందులో అదిత్ అరుణ్ శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై రవి పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సిమన్ కె. కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు.