సంక్రాంతి కళ తెచ్చిన `రంగ్ దే` ప్రేమ జంట

0

నితిన్ – కీర్తి సురేష్ జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే టాకీ పూర్తి చేసి నిర్మాణానంతర పనుల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లోనూ ఈ మూవీ షూటింగ్ ని ప్రణాళికా బద్ధంగా పూర్తి చేసింది చిత్రబృందం.

ఆన్ లొకేషన్ కీర్తిని ఆటపట్టించిన నితిన్ – వెంకీ ఇద్దరిపైనా ఆ తర్వాత రివెంజ్ మ్యాటర్ తెలిసినదే. అదంతా సరదా వ్యాపకం అనుకుంటే.. ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం చేసి ప్రమోషన్స్ లో వేడి పెంచాల్సిన టైమ్ వచ్చేసింది. తాజాగా `రంగ్ దే` టీమ్ సంక్రాంతి శుభాకాంక్షలతో పోస్టర్లను రిలీజ్ చేయగా అందులో ఓ పోస్టర్ ఆద్యంతం కలర్ ఫుల్ గా ఆకర్షించింది.

నాయకానాయికలు ఈ పోస్టర్ లో ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపించారు. కీర్తి సాంప్రదాయ పట్టు చీరలో మెడనిండా ఆభరణాలు ధరించి జెడ నిండా కనకాంబరాలు మల్లెల్ని తురిమి చిరునవ్వు చిందిస్తూ ఎంతో ముద్దొచ్చేస్తోంది. పాపిడి బొట్టు తో చిరునవ్వుల పాపాయి ఆ ఫోన్ లో నితిన్ కి ఏదో చూపిస్తోంది. ఇంతకీ అది ఏమై ఉంటుంది? అన్నది అటుంచితే తన చెంతే ఉన్న నితిన్ సైతం సుందరాంగుడిలా సాంప్రదాయ బద్ధంగా మెరూన్ కలర్ కుర్తాలో ఇస్మార్ట్ లుక్ లో కనిపించాడు.

జంట ముచ్చటగా ఉంది.. లొకేషన్ లో వైబ్రేషన్ కలర్ ఫుల్ గా ఉంది. చూస్తుంటే ఇంతే కలర్ ఫుల్ గా ప్రతి ఫ్రేమ్ ని దించేస్తే వెంకీకి మరో హిట్టు దక్కుతుందేమో. భీష్మ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలన్న కసి పంతం ఉన్న నితిన్ కి .. కంబ్యాక్ పై ఎంతో హోప్ తో ఉన్న కీర్తికి రంగ్ దే హిట్టు కొట్టి సరైన జవాబుగా నిలుస్తుందేమో. సితార బ్యానర్ కి కీలక సమయంలో మాంచి హిట్టు పడుతుందనే భావిద్దాం.. సంక్రాంతి శుభాకాంక్షలతో..