బిగ్ బాస్ కెమిస్ట్రీ కంటిన్యూ అవుతూనే ఉంది

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో పునర్నవి మరియు రాహుల్ ల మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. దాంతో సీజన్ 4 లో స్క్రిప్టెడ్ కెమిస్ట్రీని ప్లాన్ చేశారంటూ వార్తలు వచ్చాయి. మోనాల్ తో అభిజిత్ మరియు అఖిల్ లతో కెమిస్ట్రీ మెయింటెన్ చేయాలంటూ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు అనేది సోషల్ మీడియాలో పుకార్లు. మోనాల్ హౌస్ లో ఉండటం వల్ల ఖచ్చితంగా కంటెంట్ బాగానే వచ్చింది. అఖిల్ మరియు అభిజిత్ ల మద్య గొడవ మరియు ఇతరత్ర ఎపిసోడ్స్ షో కు అంతో ఇంతో రేటింగ్ ను తెచ్చి పెట్టింది. అభిజిత్ మద్యలోనే మోనాల్ కు దూరం అయినా అఖిల్ మాత్రం ఆమెతో చివరి వరకు కంటిన్యూ చేశాడు.

మోనాల్ తో అఖిల్ కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా ప్రచారం జరిగింది. అయితే షో పూర్తి తర్వాత ఇద్దరు ఎవరి దారి వారు చూసుకుంటారని అంతా భావించారు. కాని అనూహ్యంగా ప్రతి సందర్బంకు కూడా మోనాల్ మరియు అఖిల్ లు కలుస్తున్నారు. అఖిల్ మరియు సోహెల్ లతో మోనాల్ రచ్చ రచ్చ చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్బంగా మోనాల్ తో అఖిల్ సందడి చేసింది. ఇక తాజాగా మరోసారి మోనాల్ మరియు అఖిల్ లు కలిశారు. వీరితో పాటు సోహెల్ కూడా ఉన్నాడు. అఖిల్ మరియు మోనాల్ ల మద్య ఇంకా కెమిస్ట్రీ కంటిన్యూ అవుతోంది.