అదరగొడుతున్న మహేష్ న్యూ లుక్..!

0

వయసు పెరుగుతున్నకొద్దీ మరింత అందగాడిలా మారిపోతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ముందు వరసలో ఉండే మహేష్.. ప్రతీసారి తన కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటారు. లేటెస్ట్ గా రిలీజైన ఓ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.

ప్రతీ సినిమాలో స్టన్నింగ్ అండ్ యంగ్ లుక్ తో ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తుంటాడు మహేష్. తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘సర్కారు వారి పాట’కు వింటేజ్ లుక్ ను ప్రిపేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్. కాగా.. ఇప్పుడు రిలీజ్ చేసిన మిల్కీ బాయ్ లుక్ మరింత యంగ్ గా ఉంది.

సినిమాలతో పాటు యాడ్స్ లోనూ దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్. పలు రకాల ప్రకటనల్లో నటిస్తూ ముందున్నాడు. ఈ ఫ్రెష్ లుక్ కూడా ఏదైనా కొత్త యాడ్ కు సంబంధించింది కావొచ్చని భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. దీంతో అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’పై అంచనాలు పెరిగిపోతున్నాయి. పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.