డిటెక్టివ్ రామకృష్ణ`గా సునీల్ లుక్

0

కొన్ని వరుస పరాజయాలు సునీల్ ని హీరోగా రేస్ నుంచి గ్యాప్ తీసుకునేందుకు కారణమయ్యాయి. అన్ని ఫ్లాపులున్నా సునీల్ కి ఇంకా హీరోగా అవకాశాలున్నాయి. పీపుల్స్ మీడియా లాంటి సంస్థలు ఇప్పటికీ సునీల్ హీరోగా సినిమాలు తీయాలన్న ఉత్సాహంతో ఉన్నాయి. కానీ అందుకు ససేమిరా అనేస్తూ చాలావాటిని సునీల్ పెండింగులో పెట్టారన్న గుసగుసలు వినిపించాయి. అతడు ఎగ్జయిట్ చేసే క్యారెక్టర్లలో నటిస్తూ మరోవైపు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. మర్యాద రామన్న లాంటి బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ కోసం వేచి చూస్తున్నాడు.

సరైన స్క్రిప్టు తన ఫేజ్ మార్చేది ఏది? అన్నదే అతడి వెయిటింగ్. అయితే ఆ వెయిటింగ్ ఫలించాలంటే ఇప్పుడు సరికొత్త ప్రయత్నంతో రావాలన్నది అతడి పంతం. అన్ని డైలమాల నుంచి బయటపడి సునీల్ తిరిగి తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేసేందుకు కథానాయకుడిగా బరిలో దిగుతున్నాడు.

ఎట్టకేలకు సునీల్ `డిటెక్టివ్ రామకృష్ణ`గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. `కనబడుటలేదు` అనేది ఈ మూవీ టైటిల్. “మీ సునీల్ ను డిటెక్టివ్ రామ కృష్ణుడిగా విష్కరిస్తున్నాం. తెరపై త్వరలో వినోదం !!“ అంటూ తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో సునీల్ డిటెక్టివ్ లుక్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూ కనిపించాడు. చీకట్లో టార్చ్ వేసి ఏదో వెతుకుతున్నట్టే కనిపిస్తున్నాడు. వైట్ షర్ట్ బ్లాక్ ఫ్యాంట్ తో ఫార్మల్ గా కనిపిస్తున్న సునీల్ ఆ పైన బ్రౌన్ జర్కిన్ ధరించి అచ్చం డిటెక్టివ్ నే తలపించే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఏదో సీరియస్ గా వెతుకుతున్నట్టే కనిపిస్తోంది. డిటెక్టివ్ రహస్య శోధన ఏమిటి? అన్నది తెరపై చూడాల్సి ఉంటుంది. సునీల్ నటిస్తున్న ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగుకి వస్తుందా? లేదూ నేరుగా థియేటర్లలో రిలీజవుతుందా? అన్నది వేచి చూడాలి.

స్పార్క్ వీడియోస్.. స్టూడియోస్ షేడ్.. ఎస్.ఎస్.ఫిలింస్.. ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృష్ణ-బాలరాజు-వీరెల్ల సుమంత్-కోన శశిత తదితర టీమ్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.