నర్తనశాల తొమ్మిది నిమిషాల గ్లింప్స్ అదిరిందాగా

0

స్టార్ హీరో బాలకృష్ణ తొలి దర్శకత్వం వహించి నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`దాదాపు 16 ఏళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమై కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నటి సౌందర్య మరణం కారణంగా కొన్ని రోజులు చిత్రీకరణ తర్వాత నిలిచిపోయింది. దర్శకుడిగా బాలకృష్ణ పనిని అభిమానులు ఎప్పుడూ చూడలేదు. పదహారు సంవత్సరాల క్రితం చిత్రీకరించిన ఫుటేజ్ స్ట్రీమింగ్ హక్కులను శ్రేయాస్ ఈటి కొనుగోలు చేసింది.

ఈ సినిమా కోసం బాలకృష్ణ కేవలం రెండు సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారు. ఈ మూవీతో దర్శకుడిగా సీనియర్ నటుడిగా తన టాలెంట్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు బాలయ్య. అచ్చ తెలుగులో ఆయన సుదీర్ఘ సంభాషణలు నందమూరి అభిమానులకు ఒక విందు. ఈ గ్లింప్స్ చూసిన నందమూరి అభిమానులు ఖచ్చితంగా `నర్తనశాల`ని పూర్తి చేసి రిలీజ్ చేయాల్సిందే అని డిమాండ్ చేయడం గ్యారంటీ. అంత అద్భుతంగా ఈ సన్నివేశాల్ని బాలకృష్ణ తెరకెక్కించారు.

ఈ పదిహేను నిమిషాల వీడియోలో దివంగత నటి సౌందర్య శ్రీహరి తెరపై కనిపించడం ఓ అద్భుతం. వాస్తవానికి బాలకృష్ణ చిత్రీకరించిన `నర్తనశాల` సన్నివేశాల ఫుటేజ్ కేలం తొమ్మిది నిమిషాలు మాత్రమే వుంది. దానిక స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన `నర్తనశాల`లోని సన్నివేశాలని తీసుకున్నారు. బాలకృష్ణ సినిమా ఫుటేజీకి ‘నారావరా కురువరా’ పాట ని జోడించారు. ఇక `టాప్ హీరో` చిత్రంలోని ఓ పాట నుండి బాలకృష్ణ బృహన్నాల గెటప్ కు సంబంధించిన క్లిప్ని కూడా ఇందులో వాడారు. చారిటీ కోసం ఈ వీడియోను రిలీజ్ చేశారు కాబట్టి ఇందులో వున్న లోటు పాట్ల గురించి ప్రస్థావన అనవరం. అయితే బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్స్కి ఈ గ్లిప్స్ ఓ పండగే.